ముగిసిన ఎన్నికలు: పాల ధరలకు రెక్కలు, లీటరుపై రూ.2 పెంపు

By Siva KodatiFirst Published May 20, 2019, 8:18 PM IST
Highlights

ఎన్నికలు ముగియడంతో పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతుండగా ఇప్పుడు ఆ జాబితాలోకి పాలు కూడా వచ్చింది. పాల ఉత్పత్తి తగ్గడం, ఉత్పత్తి వ్యయం పెరగడంతో మంగళవారం నుంచి పాల ధరలు పెంచుతున్నట్లుగా ప్రముఖ డైరీ సంస్ధ అమూల్ తెలిపింది

ఎన్నికలు ముగియడంతో పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతుండగా ఇప్పుడు ఆ జాబితాలోకి పాలు కూడా వచ్చింది. పాల ఉత్పత్తి తగ్గడం, ఉత్పత్తి వ్యయం పెరగడంతో మంగళవారం నుంచి పాల ధరలు పెంచుతున్నట్లుగా ప్రముఖ డైరీ సంస్ధ అమూల్ తెలిపింది.

లీటర్ పాల ధర రూ.2 మేర పెరుగుతాయని... ఢిల్లీ, మహారాష్ట్ర సహా ఇతర రాష్ట్రాల్లో పెంపు అమల్లోకి వస్తుందని సంస్ధ తెలిపింది. మార్చి 2017లో పాల ధరలు పెంచిన తర్వాత మళ్లీ ఇప్పుడు ధరలను సవరించామని గుజరాత్ కో ఆపరేటివ్ మిల్క్ మార్కెటింగట్ ఫెడరేషన్ ఓ ప్రకటనలో తెలిపింది. పెరిగిన ధరలు మంగళవారం నుంచి అమల్లోకి వస్తాయని తెలిపింది. 
 

click me!