Amravati Murder Case: నిందితులంద‌ర్నీ NIA కస్టడీకి పంపిన కోర్టు.. వారంద‌రూ ఉగ్ర‌వాదులేనా!!

By Rajesh KFirst Published Jul 8, 2022, 2:23 AM IST
Highlights

Amravati Murder Case: అమరావతి హత్య కేసులో అరెస్టయిన ఏడుగురు నిందితుల‌ను  ముంబై కోర్టు జూలై 15 వరకు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) కస్టడీకి పంపింది. వారంద‌రికీ ఉగ్ర‌సంస్థ‌ల‌తో సంబంధాలున్న‌ట్లు ఎన్ ఐ ఏ ఆరోపిస్తుంది.  

Amravati Murder Case: అమరావతి హత్య కేసులో అరెస్టయిన ఏడుగురు నిందితుల‌ను ముంబై కోర్టు జూలై 15 వరకు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) కస్టడీకి పంపింది. అంతకుముందు నిందితులందరినీ తూర్పు మహారాష్ట్రలోని అమరావతి నగరం నుంచి ముంబైకి తీసుకొచ్చారు. 

బీజేపీ మాజీ అధికార ప్రతినిధి నూపుర్ శర్మకు మద్దతుగా నిలిచినందుకు మెడిక‌ల్ కెమిస్ట్ ఉమేష్ కోల్హేను అమరావతిలో అత్యంత దారుణంగా  హత్య చేశారు. జూన్ 21ను ఉమేష్ ..రోజులాగానే.. ఆ రోజు రాత్రి త‌న మెడిక‌ల్ దుకాణాన్ని క్లోజ్ చేసి..  ఇంటికి తిరిగి వస్తుండగా హత్యకు గురయ్యాడు.

Latest Videos

ప్రవక్త ముహమ్మద్ వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేసిన భారతీయ జనతా పార్టీ (బిజెపి) మాజీ నాయకుడు నుపుర్ శర్మ కు మద్దతుగా నిలిచి.. కొన్ని వాట్సాప్ గ్రూపులలో ఆమె మ‌ద్ద‌తుగా ఉమేష్ పోస్ట్‌లను షేర్ చేశారు. ఈ కార‌ణంతో ఉమేష్ కోల్హే హత్యకు గురైనట్లు పోలీసుల ప్రాథమికంగా దర్యాప్తులో తేలింది.

అందరూ తీవ్రవాదులే..NIA వాదన  

ఈ కేసు దర్యాప్తును ఎన్‌ఐఏ చేపట్టింది. ఈ సంస్థ నిందితులంద‌రినీ NIA క‌స్ట‌డీకి  త‌ర‌లించాల‌ని న్యాయ‌స్థానాన్ని కోరింది. నిందితులు ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడినట్లు ఆధారాలు ఉన్నాయని ఎన్ఐఏ తెలిపింది. అయితే, వాదనలు విన్న కోర్టు నిందితులను ఎనిమిది రోజుల ఎన్‌ఐఏ కస్టడీకి పంపింది.

ఉదయపూర్ ఊచకోతకు వారం రోజుల ముందు అమరావతిలో హత్య 

ఉదయపూర్ హత్య కేసుకు వారం రోజుల ముందు ఉమేష్ కొల్హే అమరావతిలో హత్యకు గుర‌య్యారు. నూపుర్ శ‌ర్మ‌కు మ‌ద్ద‌తుగా నిలిచిన‌ ఉదయ్‌పూర్‌లోని కన్హయ్య లాల్ అనే టైలర్ హత్యకు గురయ్యాడు. హత్యను నిందితుడు వీడియో తీసి.. సోష‌ల్ మీడియాలో పోస్టు చేశారు. బీజేపీ మాజీ నేత నుపుర్ శర్మ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు మద్దతు ఇచ్చినందుకు కన్హయ్యాలాల్ హత్యకు గురయ్యాడు. ఈ కేసులో ప్రధాన నిందితుడు సహా మొత్తం నలుగురిని రాజస్థాన్ పోలీసులు అరెస్టు చేశారు. దీనిపై ఎన్‌ఐఏ కూడా విచారణ జరుపుతోంది.

అమరావతిలోని కెమిస్ట్ ఉమేష్ కోల్హే హత్య కేసులో ఏడుగురు నిందితుల‌ను అరెస్టు కాగా..వారిని  ముంబైలోని ప్రత్యేక కోర్టు జూలై 15 వరకు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) కస్టడీకి పంపింది. 

అరెస్టు అయిన నిందితులు వీరే.. 
  
1. ముదస్సర్ అహ్మద్ అలియాస్ సోను రజా షేక్ ఇబ్రహీం (22), 
2. షారుఖ్ పఠాన్ అలియాస్ బాద్షాషా హిదాయత్ ఖాన్ (25), 
3. అబ్దుల్ తౌఫిక్ అలియాస్ నాను షేక్ తస్లీమ్‌
4 ఇర్ఫాన్ ఖాన్ (32)  ప్రధాన సూత్రధారి 
5. షోబ్ ఖాన్ అలియాస్ భూర్యా సబీర్ ఖాన్ (22), 
6. అతిబ్ రషీద్ ఆదిల్ రషీద్ (22), 
7. యూసుఫ్ ఖాన్ బహదూర్ ఖాన్ (44)...  వీరంద‌రిని ఎన్ ఐఏ క‌స్ట‌డీలోకి త‌ర‌లించింది.  


ఈ కేసు చాలా  సున్నితమైనది, కాబట్టి, మీడియాను అనుమతించరాదని ఏజెన్సీ తెలిపింది. ప్రత్యేక NIA న్యాయమూర్తి ఎకె లహోటి అభ్యర్థనను అంగీకరించి మీడియాను కోర్టు గదిలోకి రానీయకుండా నిషేధించారు. అయితే, న్యాయస్థానం వెలుపల వినిపించిన వాదనల నుండి, నిందితులకు వ్యతిరేకంగా నేరారోపణ సాక్ష్యాలు ఉన్నాయని ఏజెన్సీ పేర్కొంది. నిందితులపై చట్టవిరుద్ధ కార్యకలాపాల (నివారణ) చట్టం (యూఏపీఏ)లోని 16, 18, 20 కఠిన సెక్షన్ల కింద అభియోగాలు మోపారు.
 
UAPA యొక్క సెక్షన్లు 16, 18,  20

1) UAPAలోని సెక్షన్ 16 తీవ్రవాద చర్యలకు శిక్ష గురించి తెలుపుతోంది.ఈ సెక్ష‌న్ ప్ర‌కారం.. ఎవరైనా ఉగ్రవాద చర్యకు పాల్పడితే --

ఎ) ఉగ్ర‌చర్య వ‌ల్ల‌ ఏ వ్యక్తి అయిన మ‌ర‌ణిస్తే..  స‌ద‌రు నిందితుడికి  మరణశిక్ష లేదా యావజ్జీవ కారాగార శిక్ష విధించబడుతుంది. అలాగే.. జరిమానా కూడా విధించబడుతుంది.

బి) ఏదైనా ఇతర కేసులో.. ఐదేళ్ల  సంవ‌త్స‌ర కంటే తక్కువ ఉండని కాలానికి జైలు శిక్ష విధించబడుతుంది, అయితే ఇది యావజ్జీవ ఖైదు వరకు పొడిగించవచ్చు. జరిమానా కూడా విధించబడుతుంది.

2) UAPAలోని సెక్షన్ 18 కుట్ర మొదలైనవాటికి శిక్షను నిర్వచిస్తుంది. "ఎవరైనా కుట్రలు చేసినా లేదా ప్రయత్నించినా, లేదా వాదించినా, ప్రోత్సహించినా, సలహా ఇచ్చినా, ప్రేరేపించినా లేదా ఉగ్రవాద చర్య పాడ్పినా లేదా ఉగ్ర‌వాదుల‌కు స‌హాక‌రించిన శిక్షార్హులు. తీవ్రవాద చర్యలో పాల్ప‌డిన వారికి  ఐదేళ్ల  సంవ‌త్స‌రాల కంటే ఎక్కువ జైలు శిక్ష విధించబడుతుంది. కొన్ని సందర్భాల్లో  యావజ్జీవ కారాగార శిక్ష కూడా విధించ‌బ‌డవచ్చు. 

3) UAPAలోని సెక్షన్ 20 తీవ్రవాద ముఠా లేదా సంస్థలో సభ్యుడిగా ఉన్నందుకు శిక్షను వివరిస్తుంది. 
 ఉగ్రవాద ముఠా లేదా ఉగ్రవాద సంస్థలో సభ్యుడిగా  ప‌ని చేసినా లేదా తీవ్రవాద చర్యలో పాలుపంచుకున్నా.. జీవిత ఖైదు శిక్ష‌ప‌డే అవ‌కాశముంది.

click me!