Raj Babbar: 26 ఏళ్ల నాటి కేసులో రాజ్ బబ్బర్ కు జైలు శిక్ష‌.. జ‌రిమానా.. ఇంత‌కీ ఆ కేసేంటీ

Published : Jul 08, 2022, 12:53 AM IST
Raj Babbar: 26 ఏళ్ల నాటి కేసులో రాజ్ బబ్బర్ కు జైలు శిక్ష‌.. జ‌రిమానా.. ఇంత‌కీ ఆ కేసేంటీ

సారాంశం

Raj Babbar: ఎన్నికల అధికారిపై దాడికి పాల్పడ్డ కేసులో నటుడు, రాజకీయ నాయకుడు రాజ్ బబ్బర్‌కు రెండేళ్ల జైలు శిక్ష విధించింది ఉత్తర ప్రదేశ్ కోర్టు. ఈ దాడి ఘటన 1996లో జరిగింది. కేసు వివరాల ప్రకారం.. 1996లో రాజ్ బబ్బర్ ఎన్నిక అధికారిపై దాడి చేశారు.  

Raj Babbar: ప్రముఖ సినీ నటుడు, కాంగ్రెస్ నాయకుడు రాజ్ బబ్బర్ కు జైలు శిక్ష‌ప‌డింది.  26 ఏళ్ల నాటి కేసులో ఆయ‌న దోషిగా తేల‌డంతో రెండ్లేండ్ల శిక్ష‌ప‌డింది. 1996 ఎన్నికల్లో పోలింగ్ అధికారిపై దాడి చేసిన కేసులో రాజ్ బబ్బర్‌ను దోషిగా నిర్ధారించింది ఉత్తర ప్రదేశ్ కోర్టు. ఉత్తర ప్రదేశ్ కోర్టు ప్రత్యేక అదనపు చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్..  రాజ్ బబ్బర్‌కు రెండేళ్ల జైలుశిక్ష తోపాటు రూ.6,500 జరిమానా విధించింది. 

ఈ కేసులో రాజ్ బబ్బర్‌తో నిందితుడిగా ఉన్న అరవింద్ సింగ్ యాదవ్ విచారణ సమయంలో మరణించాడు. తరువాత.. కోర్టు రాజ్ బబ్బర్‌ను మధ్యంతర బెయిల్‌పై విడుదల చేసింది, తీర్పుపై అప్పీల్ దాఖలు చేయడానికి అవకాశం కల్పించింది.

వివరాల్లోకెళ్తే.. మే 2, 1996న పోలింగ్ అధికారి శ్రీ కృష్ణ సింగ్ రాణా..  వజీర్‌గంజ్ పోలీస్ స్టేషన్ ప‌రిధిలో గుర్తు తెలియని వ్యక్తులతో  రాజ్ బబ్బర్, అరవింద్ సింగ్ యాదవ్‌లపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. 

వజీర్‌గంజ్ పోలీస్ స్టేషన్ ప‌రిధిలోని పోలింగ్ స్టేషన్ నంబర్ 192/103లోని బూత్ నంబర్ 192కి ఓటర్లు రావడం మానేయడంతో అధికారులు పోలింగ్ స్టేషన్ నుంచి బయటకు వెళ్తున్నారని ఫిర్యాదు చేశారు. కాగా, లక్నోలో అప్పటి సమాజ్‌వాదీ పార్టీ లోక్‌సభ అభ్యర్థి రాజ్‌బబ్బర్‌ తన సహచరులతో కలిసి పోలింగ్‌ బూత్‌కు వచ్చి.. నకిలీ ఓటింగ్‌పై తప్పుడు ఆరోపణలు చేయడం ప్రారంభించాడు. ఈ క్ర‌మంలో పోలింగ్ అధికారి శ్రీ కృష్ణ సింగ్ రాణా పై రాజ్ బబ్బర్, అతని సహచరులు దాడిచేశారు. ఈ క్ర‌మంలో పోలింగ్ స్టేషన్ అధికారి మనోజ్ కుమార్ శ్రీవాస్తవ, వీకే శుక్లా, పోలీసులు అతన్ని రక్షించారు.

అనంత‌రం శ్రీ కృష్ణ సింగ్ రాణా.. వజీర్‌గంజ్ పోలీస్ స్టేషన్ ప‌రిధిలో ఫిర్యాదు చేశారు. పోలీసులు దర్యాప్తు చేసి రాజ్ బబ్బర్, అరవింద్ యాదవ్‌లపై సెక్షన్ 143, 332, 353, 323, 504, 188 సెక్షన్ల కింద కేసు చేశారు.  

సాక్ష్యాలను కనుగొన్నారు, 23 సెప్టెంబర్ 1996న కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. చార్జిషీటును పరిగణనలోకి తీసుకున్న కోర్టు నిందితులకు సమన్లు ​​జారీ చేసింది. 7 మార్చి 2020న రాజ్ బబ్బర్‌పై అభియోగాలు మోపబడ్డాయి.  అయితే అప్పట్లో ఆయనకు ఈ కేసులో బెయిల్ లభించింది. కాగా, ఈ కేసుపై ఇంతకాలంగా విచారణ సాగింది.
 
ఈ కేసులో రాజ్ బబ్బర్‌ తప్పు చేశాడని గుర్తించిన కోర్టు.. అతడికి రెండేళ్ల జైలు శిక్ష విధిస్తూ గురువారం తీర్పునిచ్చింది. అలాగే రూ.8,500 జరిమానా విధించింది. కాగా.. కోర్టు తీర్పుపై రాజ్ బబ్బర్ అసంతృప్తి చెందారు. ప్రస్తుతం ఆయన ఈ కేసులో బెయిల్ కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. అలాగే.. ఈ కేసు విష‌యంలో సుప్రీం కోర్టును ఆశ్ర‌యిస్తాన‌ని తెలిపారు.

PREV
click me!

Recommended Stories

Ahmedabad International Kite Festival సంక్రాంతి సంబరాల్లో పతంగ్ లు ఎగరేసిన మోదీ| Asianet News Telugu
Digital Health : ఇక వైద్యరంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ... కీలక పరిణామాలు