రైతుల రుణాలు తీర్చిన బిగ్ బీ

By rajesh yFirst Published Aug 29, 2018, 6:59 PM IST
Highlights

ముంబయి: నటనలో జీవించడమే కాదు. నిజజీవితంలో కూడా జీవించడం ఆయనకు ఆయనే సాటి. ప్రకటనలు ఇవ్వడం హామీలు ఇవ్వడం కాదు...సాయం చేసిన కూడా చెప్పుకోని మనస్సున మారాజు ఆయన బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్. బిగ్ బీ అన్నట్లుగా పేరుకు తగ్గట్టే అన్నదాత పట్ల, సైనికుల పట్ల తన పెద్ద మనసును చాటుకున్నారు. 

ముంబయి: నటనలో జీవించడమే కాదు. నిజజీవితంలో కూడా జీవించడం ఆయనకు ఆయనే సాటి. ప్రకటనలు ఇవ్వడం హామీలు ఇవ్వడం కాదు...సాయం చేసిన కూడా చెప్పుకోని మనస్సున మారాజు ఆయన బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్. బిగ్ బీ అన్నట్లుగా పేరుకు తగ్గట్టే అన్నదాత పట్ల, సైనికుల పట్ల తన పెద్ద మనసును చాటుకున్నారు. 

దేశానికి పట్టెడన్నం పెట్టే రైతన్నకష్టాలు తీర్చారు. పండించిన పంటకు గిట్టుబాటు ధరలేక... చేసిన అప్పులు తీర్చలేక బలవన్మరణాలకు పాల్పడ్డ రైతన్న కుటుంబాలకు ఆపన్న హస్తం అందించారు. 50 మంది రైతు కుటుంబాల జాబితా తీసుకుని వాళ్ల రుణాలు తీర్చారు...తాజాగా 200 మంది రైతుల జాబితాను తీసుకుని వారు చెల్లించాల్సిన కోటి 25లక్షల రూపాయలను బ్యాంకుకు చెల్లించి రైతుల పట్ల తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు. 

రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు నా హృదయాన్ని ఎన్నో సార్లు తాకాయి. రైతుల ఆత్మహత్యలు నన్ను షాక్ కు గురి చేశాయి. కొన్నేళ్ల క్రితం వైజాగ్ లో ఓ సినిమా షూటింగ్ చేస్తున్నాం. అప్పుడు ఓ రైతు తాను తీసుకున్న వేల రూపాయల రుణం తీర్చలేక ఆత్మహత్య చేసుకున్నాడని తెలిసి ఘోరంగా బాధపడ్డానని ఆవేదన వ్యక్తం చేశారు. 

అంతేకాదు దేశం కోసం అనేక మంది సైనికులు తమ ప్రాణాలు కోల్పోవడం కలచివేస్తుంది. వారి కుటుంబాలను ఆదుకోవాలని అనుకున్నాను. మాకు 44 మంది సైనికుల కుటుంబాల జాబితాను ఇచ్చినందుకు ముంబాయి సీఎం కార్యాలయంలో పనిచేస్తున్న అధికారులకు ధన్యవాదాలు తెలిపారు. ప్రాణత్యాగం చేసిన సైనికుల కుటుంబాలను అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు.

ప్రచారాల్లో పాల్గొని సేవ చేయడం కన్నా.. స్వయంగా విరాళాలు అందిస్తే ఎక్కువ మేలు జరుగుతుందని బిగ్ బీ అమితాబ్ అభిప్రాయపడ్డారు. ఇంకా రైతుల రుణాలు మాఫీ చేస్తానని....సైనికుల కుటుంబాలను ఆదుకుంటానని ఇది నిరంతరం జరిగే ప్రక్రియ అంటూ స్పష్టం చేశారు. 

click me!