ఉగ్రవాదుల కాల్పుల్లో నలుగురు పోలీసులు మృతి

Published : Aug 29, 2018, 05:41 PM ISTUpdated : Sep 09, 2018, 11:17 AM IST
ఉగ్రవాదుల కాల్పుల్లో నలుగురు పోలీసులు మృతి

సారాంశం

జమ్మూకాశ్మీర్ లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. సోఫియాన్ జిల్లాలో విధులు నిర్వహిస్తున్న పోలీస్ బృందంపై కాల్పులకు తెగబడ్డారు. ఈ కాల్పుల్లో నలుగురు పోలీసులు అక్కడికక్కడే మృతిచెందారు.  

జమ్మూకాశ్మీర్ లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. సోఫియాన్ జిల్లాలో విధులు నిర్వహిస్తున్న పోలీస్ బృందంపై కాల్పులకు తెగబడ్డారు. ఈ కాల్పుల్లో నలుగురు పోలీసులు అక్కడికక్కడే మృతిచెందారు.

సోఫియాన్ జిల్లాలో అరహమా ప్రాంతంలో నిలిచిపోయిన ఓ వాహనాన్ని తీసుకురాడానికి ఓ పోలీస్ బృందం వెళ్లింది. అయితే ఈ విషయం తెలిసి అప్పటికే అక్కడ కాపుకాచిన ఉగ్రవాదులు వీరిపై కాల్పులకు తెగబడ్డారు.అకస్మాత్తుగా జరిగిన ఈ దాడిలో పోలీసులు అప్రమత్తమయ్యేందుకు అసలు సమయమే లేకుండా పోయింది. దీంతో నలుగురు పోలీసులు సంఘటనా స్థలంలోనే ప్రాణాలు వదిలారు.

ఈ దాడిలో భారీగా ఉగ్రవాదులు పాల్గొన్నారని తెలుస్తోంది. పోలీసుల వద్ద ఉన్న ఆయుధాలను కూడా ఉగ్రవాదులు ఎత్తుకెళ్లారు. ఈ ఘటనకు సంబంధించిన మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

ఈ కాల్పుల గురించి సమాచారం అందుకున్న భద్రతా సిబ్బంది హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. కాల్పులు జరిగిన ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

MICE పథకం.. ఈ రంగంలో గేమ్‌ చేంజర్
రైళ్లలో ఇకపై లగేజీకి ఛార్జీలు:Ashwini Vaishnaw on Indian Railway Luggage Rules | Asianet News Telugu