రూ.1.4 లక్షల ఫోన్ పోగొట్టుకున్న అమితాబ్ బచ్చన్ సహాయకుడు.. నిజాయితీగా పోలీసులకు అప్పగించిన రైల్వే కూలీ

By Asianet NewsFirst Published Mar 22, 2023, 10:41 AM IST
Highlights

రైల్వే స్టేషన్  ప్లాట్‌ఫారమ్‌పై ఉన్న సీటింగ్ ఏరియాలో అమితాబ్ బచ్చన్ సహాయకుడు రూ.1.4 లక్షల ఫోన్ ను పోగొట్టుకున్నాడు. అయితే దానిని ఓ రైల్వే కూలీ గమనించాడు. ఫోన్ ను తీసుకొని రైల్వే పోలీసులకు అప్పగించారు. దీంతో ఆయనను పోలీసులు, ఫోన్ యజమాని ప్రశంసించారు. చిరు బహుమతి అందించారు. 

ఆయనో రైల్వే కూలీ. దశాబ్దాలుగా అదే పని చేస్తున్నారు. తన వృత్తినే నమ్ముకొని కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ప్రస్తుతం వృద్ధాప్యానికి చేరుకున్నాడు. పొద్దంతా కష్టపడితే రూ.300 వందలు వస్తాయి. సంపాదించేవి తక్కువే అయినా నిజాయితీగానే ఉంటారు. రైళ్లలో నుంచి దిగిన ప్రయాణికుల లగేజీని కారు వరకు తీసుకెళ్లడం ఆయన చేసే పని. దీంతో ప్రయాణికులు ఆయనకు కొంత డబ్బులు ఇస్తారు. ఈ క్రమంలో ఎవరైనా అతడి వద్ద వస్తువులు మర్చిపోతే వాటిని ఉంచుకోకుండా వెంటనే పోలీసులకు అప్పగించేస్తారు. తాజాగా కూడా ఆయన ఇలాంటి పని చేసి ప్రముఖ వ్యక్తి నుంచి ప్రశంసలు అందుకున్నారు. దాదాపు లక్షన్నర రూపాయిల విలువ చేసే ఫోన్ ను పోలీసులకు అందించి వార్తల్లో నిలిచారు.

ఏనుగుకు రూ.5కోట్ల ఆస్తి...యజమాని హత్య..!

వివరాలు ఇలా ఉన్నాయి. ముంబైలో దాదర్ రైల్వే  స్టేషన్‌లో దశరథ్ దౌండ్ అనే వ్యక్తి మూడు దశాబ్దాలుగా రైల్వే కూలీగా పని చేస్తున్నారు. ఈ క్రమంలో సోవవారం కూడా ఆయన పనికి వెళ్లారు. అయితే స్టేషన్‌లోని సీటింగ్ ఏరియాలో అనుకోకుండా ఎవరో విలువైన ఫోన్ మర్చిపోయారు. దీనిని దౌండ్ గమనించాడు. దానిని అతడు తన వద్ద కొంత సమయం కూడా ఉంచుకోలేదు. వెంటనే ఆయన చౌకీలోని గవర్నమెంట్ రైల్వే పోలీసులకు ( జీఆర్పీ) ఫోన్ అందించారు. దీంతో పోలీసులు ముందుగా అతడిని అభినందించారు.

దేశ రాజధానిలో మోదీ వ్యతిరేక పోస్టర్లు.. రంగంలోకి పోలీసులు.. 44 కేసులు, నలుగురు అరెస్ట్..

పోలీసుల దర్యాప్తులో ఆ ఫోన్ ప్రముఖ వ్యక్తికి చెందినదని గుర్తించారు. రూ.1.4 లక్షల విలువైన ఫోన్ నటుడు అమితాబ్ బచ్చన్ కు విశ్వసనీయ మేకప్ ఆర్టిస్ట్ దీపక్ సావంత్‌ కు చెందినది అని కనుగొన్నారు. వెంటనే ఆయనకు ఈ సమాచారాన్ని అందించారు. దీంతో దీపక్ సావంత్ స్టేషన్ కు చేరుకున్నారు. కూలీ నిజాయితీని ప్రశంసించారు. అతడికి రూ.1,000 బహుమతిని అందించారు. 

ప్రధాని మోదీని 'అన్నయ్య' అని సంబోధించిన కేజ్రీవాల్.. కారణమేంటీ?

దీనిపై దశరత్ దౌండ్ ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’తో మాట్లాడుతూ... ‘‘ రాత్రి 11. 40 గంటల సమయంలో 4వ నంబర్ ప్లాట్‌ఫారమ్‌పై నా పనిని పూర్తి చేసుకున్నాను. ప్లాట్‌ఫారమ్‌పై నడుచుకుంటూ వెళ్తుండగా.. సీటింగ్ ఏరియాలో ఫోన్ పడి ఉండడం గమనించాను. నేను దానిని తీసుకొని సమీపంలో కూర్చున్న ప్రయాణికులను ‘ఇది మీదేనా’ అని అడిగాను. కానీ అందరూ ఆ ఫోన్ తమది కాదని అన్నారు. తరువాత నేను వెంనే  దాదర్ జీఆర్పీ చౌకీకి వెళ్లాను. పోలీసులకు దానిని అప్పగించాను.’’ అని ఆయన అన్నారు. ‘‘నాకు గాడ్జెట్‌లపై అంతగా అవగాహన లేదు. వేరొకరి వస్తువులు ఎంత విలువైనప్పటికీ వాటిని నా వద్ద ఉంచుకోను.’’ అని తెలిపారు. 

click me!