ఓ వ్యక్తి తన యావదాస్తిని ఏనుగుల పేరిట రాసేశాడు. దుండగల నుంచి తన ప్రాణాలు కాపాడిన కారణం చేత తన ఆస్తిని మొత్తం ఏనుగుల పేరిట రాసేశాడు.
జీవితంలో అందరూ కష్టపడేది నాలుగురాళ్లు వెనకేసుకోవడానికే. ఆ సంపాదించిన ఆస్తిని ఎవరైనా తమ కన్నబిడ్డలకు , అయినవాళ్లకు రాసిస్తూ ఉంటారు.లేదు... పిల్లల ప్రవర్తన నచ్చకపోయినా, వారికి సంతానం లేకపోతే ఏ అనాథ శరణాలయానికో, స్వచ్ఛంద సంస్థలకో రాసిస్తారు. ఇది చాలా కామన్. కానీ... తన ఆస్తిని ఏనుగుకు రాయడం గురించి ఎప్పుడైనా విన్నారా..? ఓ వ్యక్తి అదే చేశాడు. ఇంతకీ ఆ వ్యక్తి కథేంటో మనమూ తెలుసుకుందాం.
ఓ వ్యక్తి తన యావదాస్తిని ఏనుగుల పేరిట రాసేశాడు. దుండగల నుంచి తన ప్రాణాలు కాపాడిన కారణం చేత తన ఆస్తిని మొత్తం ఏనుగుల పేరిట రాసేశాడు. ఈ సంఘటన బిహార్ లో చోటుచేసుకుంది.
undefined
బిహార్ రాష్ట్రంలోని జాన్ పూర్ కు చెందిన మహమ్మద్ అక్తర్ ఇమామ్ అనే వ్యక్తి రెండు ఏనుగుల పేరు మీద రూ.5కోట్ల విలువైన ఆస్తి రాశాడు. ఈ రెండు ఏనుగుల్లో ఒక ఏనుగు అనారోగ్యంతో మరణించింది. దీంతో ఆస్తి మొత్తం ఒక్క ఏనుగు మీదకు వచ్చేసింది. ఒకసారి ఈ రెండు ఏనుగులు ఆయనను దుండగుల నుంచి కాపాడాయి. దీంతో... తాను చనిపోయిన తర్వాత.. ఆ ఏనుగుల పోషణకు ఇబ్బంది కలగకూడదని ఆయన అలా చేయడం విశేషం.
అయితే... ఆయన అలా ఏనుగుకు ఆస్తి రాయడం భార్య, పిల్లలకు నచ్చలేదు. వాళ్లు అప్పటికే విడిపోయి ఉంటున్నప్పటికీ.... ఆస్తి ఏనుగు పేరిట రాయడం నచ్చక... అతనిని దారుణంగా హత్య చేయడం గమనార్హం. 2021లో అతను హత్యకు గురయ్యాడు. అయితే.. అతను అప్పటికే ఆస్తి వీలునామా రాయడంతో... ఏనుగుల పేరిట ఆస్తి వెళ్లిపోయింది. రెండు ఏనుగుల్లో ఒక ఏనుగు చనిపోవడంతో..రూ.5కోట్ల ఆస్తి ఇప్పుడు రాణి అనే ఏనుగు పేరిట ఉంది. ప్రస్తుతం రాణి ఉత్తరాఖండ్‌లోని రామ్‌నగర్‌లో ఓ వ్యక్తి సంరక్షణలో క్షేమంగా ఉంది. ఆస్తి మాత్రం బీహార్‌లోని పాట్నాలో ఉంది. ఆస్తిని రాణికి సద్వినియోగం చేస్తేనే అక్తర్ ఆశయం నెరవేరుతుందని ఫారెస్ట్ అధికారులు చెబుతున్నారు.