Amit Shah: 13 ఏండ్ల తర్వాత ఫ్యామిలీతో సినిమా చూశా..! సరదా వ్యాఖ్య‌తో భార్యను ఆటప‌ట్టించిన‌ అమిత్‌ షా

Published : Jun 02, 2022, 10:23 AM IST
Amit Shah: 13 ఏండ్ల తర్వాత ఫ్యామిలీతో సినిమా చూశా..! సరదా వ్యాఖ్య‌తో భార్యను ఆటప‌ట్టించిన‌ అమిత్‌ షా

సారాంశం

Amit Shah: 'సామ్రాట్ పృథ్వీరాజ్' సినిమా ప్రత్యేక ప్రదర్శనకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా  కుటుంబ స‌హితంగా  హాజరయ్యారు. స్క్రీనింగ్ అనంత‌రం ఈ చిత్రంలోని నటీనటులు, సిబ్బందిని ప్రశంసించారు. ఈ స‌మ‌యంలో స‌ర‌దా వ్యాఖ్య‌తో త‌న భార్య‌ను ఆట‌ప‌ట్టించారు. అక్కడున్న వారి ముఖాల్లో నవ్వుల పూవ్వులు పూయించారు.    

Amit Shah: న్యూఢిల్లీలో బుధవారం సాయంత్రం జరిగిన 'సామ్రాట్ పృథ్వీరాజ్' సినిమా ప్రత్యేక ప్రదర్శనకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా హాజరయ్యారు. స్క్రీనింగ్ అనంత‌రం ఈ పీరియాడికల్ డ్రామాలోని నటీనటులు, సిబ్బందిని ప్రశంసించారు. భారతదేశ సాంస్కృతిక యుద్ధాలను వివరించే ఈ చిత్రాన్ని చరిత్ర విద్యార్థిగా చూసి ఆనందించానని చెప్పారు. 13 ఏళ్ల తర్వాత కుటుంబంతో కలిసి థియేటర్‌లో సినిమా చూస్తున్నానని అమిత్ షా అన్నారు. సెంట్రల్ ఢిల్లీలోని ఓ సినిమా హాలులో ఆయన తన కుటుంబ సభ్యులు, పలువురు కేంద్ర మంత్రులతో కలిసి సినిమాను వీక్షించారు.

భారతీయ సంస్కృతిని ప్రతిబింబిస్తుంది: అమిత్ షా

మహిళలను గౌరవించడం, వారికి సాధికారత కల్పించడం భారతీయ సంస్కృతి అని, ఈ చిత్రం భారతీయ సంస్కృతిని ప్రతిబింబిస్తుందని అమిత్ షా అన్నారు. మధ్యయుగ యుగాలలో స్త్రీలు అనుభవించిన రాజకీయ అధికారం, స్వేచ్ఛ గురించి ఈ చిత్రంలో చూపించారని తెలిపారు. 

‘చల్యే హుకుం’ అని అమిత్ షా ఎవరికి చెప్పారో తెలుసా?

మంత్రి అమిత్ షా త‌న ప్రసంగం ముగించి బ‌య‌ట‌కు వెళ్తున్నారు. కానీ, ఆయన భార్య సోనాల్ షా ఎటువైపు వెళ్లాలో తెలియక అయోమయంలో పడ్డారు. దీంతో ఆమె స్టేజ్ ప‌క్క‌నే నిలవడం ఉండిపోయారు. ఆ విష‌యాన్ని గ‌మ‌నించిన మంత్రి అమిత్ షా..  ‘చలియే హుకుం’ అని గాంభీర్యమైన స్వరంతో అన్నారు. దీంతో ఆ మాటకు ఆమె సిగ్గుతో తలదించుకోగా.. అమిత్ షా..  మాటలు విని ప్రేక్షకుల 
గోల్లున నవ్వారు. ఆ తర్వాత షా తనయుడు జై షా తన తల్లిని దగ్గరుండి తండ్రి దగ్గరకు తీసుకెళ్లాడు.  చాణక్య ఫిల్మ్ హాల్‌లో స్క్రీనింగ్ సమయంలో అమిత్ షా కుమారుడు జై షా కూడా హాజ‌ర‌య్యారు.
  
బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో న‌టించిన‌ లేటేస్ట్ చిత్రం సామ్రాట్ పృథ్వీరాజ్. ఈ సినిమాతో 2017 మిస్ యూనివర్స్ మనుషి చిల్లర్ చిత్ర సీమలో అడుగుపెడుతోన్న విష‌యం తెలిసిందే.. ఈ చితాన్నియాష్ రాజ్ ఫిలిమ్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుండ‌గా..  ద‌ర్శ‌కుడు చంద్రప్రకాష్ ద్వివేది ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. ఈ చిత్రాన్ని అత్యంత పరాక్రమ ధైర్య సాహసాలు కలిగి ఢిల్లీని పాలించిన పృథ్వీరాజ్ చౌహాన్  జీవిత చరిత్రను ఆధారంగా తీసుకుని తెరకెక్కిస్తున్నారు. కాగా..  'సామ్రాట్ పృథ్వీరాజ్ చిత్రం జూన్ 3న థియేటర్లలో విడుద‌ల కానున్న‌ది.  

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Republic Day Parade: ఘనంగా గణతంత్ర దినోత్సవ పరేడ్ సన్నాహాలు| Asianet News Telugu
Fresh Snowfall in Shimla Delights Tourists: రికార్డు స్థాయిలో సిమ్లాలో మంచు వర్షం| Asianet Telugu