మరోసారి ముస్లిం రిజర్వేషన్ పై అమిత్ షా సంచలన వ్యాఖ్యలు.. ఇంతకీ ఏమన్నారంటే..?   

Published : Jun 11, 2023, 12:18 AM IST
మరోసారి ముస్లిం రిజర్వేషన్ పై అమిత్ షా సంచలన వ్యాఖ్యలు.. ఇంతకీ ఏమన్నారంటే..?   

సారాంశం

Muslim Reservation: రాజ్యాంగానికి విరుద్ధంగా ముస్లిం రిజర్వేషన్లు ఉండకూడదని బీజేపీ విశ్వసిస్తోందని అమిత్ షా అన్నారు. నాందేడ్‌లో జరిగిన ర్యాలీలో హోంమంత్రి అమిత్ షా ఈ సంచలన ప్రకటన చేశారు. 

Muslim Reservation: ముస్లిం రిజర్వేషన్లపై కేంద్రం హోంశాఖ మంత్రి అమిత్ షా సంచలన ప్రకటన చేశారు. ముస్లిం వర్గాల రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధమని, మత ఆధారిత రిజర్వేషన్లు ఉండకూడదని అమిత్ షా అన్నారు. కేంద్రంలోని ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం తొమ్మిదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా శనివారం మహారాష్ట్రలోని నాందేడ్‌లో భారతీయ జనతా పార్టీ (బిజెపి) ఓ సమావేశం నిర్వహించింది.

ఈ సమావేశంలో అమిత్ షా  మాట్లాడుతూ.. రాజ్యాంగానికి విరుద్ధం కాబట్టి ముస్లిం రిజర్వేషన్లు ఉండకూడదని బీజేపీ విశ్వసిస్తోందన్నారు. మత ఆధారిత రిజర్వేషన్లు ఉండకూడదు. దీనిపై ఉద్ధవ్ ఠాక్రే తన వైఖరిని స్పష్టం చేయాలని షా అన్నారు. మహారాష్ట్రలో పెరుగుతున్న మత ఘర్షణలు, అలాగే.. కర్ణాటకలో ముస్లింల కోటాను అసెంబ్లీ ఎన్నికలకు ముందు అప్పటి BJP ప్రభుత్వం రద్దు చేసిన నేపథ్యంలో గురించి తెలిపారు. తాజాగా ముస్లిం రిజర్వేషన్లపై అమిత్ షా చేసిన ప్రకటన ప్రాముఖ్యతను సంతరించుకుంది .

విదేశాలకు వెళ్లి దేశాన్ని అవమానిస్తున్నారు. 

అనంతరం కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీని అమిత్ షా టార్గెట్ చేస్తూ.. “ప్రధాని నరేంద్ర మోదీ ఎక్కడికి వెళ్లినా మోదీ.. మోదీ.. మోదీ అంటూ నినాదాలు చేస్తుంటారు.. ఒకవైపు మోదీజీకి ప్రపంచంలోనే గౌరవం లభిస్తోంది. మరోవైపు, కాంగ్రెస్ యువరాజు రాహుల్ విదేశాలకు వెళ్లి దేశాన్ని అవమానిస్తున్నారు"అని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో రాహుల్ గాంధీ మాట వినేవారు తక్కువ కాబట్టి.. విదేశాల్లో స్వదేశాన్ని అవమానిస్తున్నారని మండిపడ్డారు. అలాగే.. రాహుల్ గాంధీ విదేశీ పర్యటన గురించి మాట్లాడుతూ విమర్శలు గుప్పించారు. రాహుల్ గాంధీకి దేశంపై సరైన అవగాహన లేదనీ, తెలియకపోతే కాంగ్రెస్ సీనియర్ నేతలను అడిగి తెలుసుకోవాలని హితవు పలికారు. రాహుల్ గాంధీ ఇక్కడ (మన దేశంలో) మాట్లాడడు, కానీ, విదేశాల్లో దేశాన్ని అవమానిస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తారనీ, ఎందుకంటే ఇక్కడ ఆయన వినేవాళ్లు తక్కువ అయ్యారని ఎద్దేవా చేశారు.

తీవ్రవాద ఘటనలు చాలా తగ్గాయి

కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో దేశవ్యాప్తంగా తీవ్రవాద ఘటనలు జరిగేవని, అమాయకులు చనిపోయారని, అయితే మోదీ ప్రభుత్వ హయాంలో దేశంలో ఉగ్రవాద ఘటనలు భారీగా తగ్గాయని షా అన్నారు. ఇంతకు ముందు కాంగ్రెస్ ప్రభుత్వంలో మన దేశ సైనికుల తలలు నరికినా, మన్మోహన్ సింగ్ నోటి నుండి ఒక్క శబ్దం కూడా రాలేదని విమర్శించారు. అయోధ్యలో రామమందిరం కట్టబోమని ఇంతకుముందు ప్రజలు భావించే వారని, మోడీ ప్రభుత్వంలో రామమందిరం నిర్మిస్తోందని ఆయన అన్నారు.

ముస్లిం రిజర్వేషన్లు అంతం కావాలన్నదే బీజేపీ  లక్ష్యమనీ, మత ఆధారిత రిజర్వేషన్లు ఉండకూడదని అమిత్ సంచలన వ్యాఖ్యాలు చేశారు. ఈ విషయంపై ఉద్ధవ్ ఠాక్రే కూడా తన వైఖరిని స్పష్టం చేయాలనీ, ఈ విషయంపై ఉద్ధవ్ జీని అడగాలనుకుంటున్నాననీ, ముస్లిం రిజర్వేషన్‌కు అనుకూలంగా ఉన్నారా? అని ప్రశ్నించారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IT Jobs : ఇక TCS లో ఉద్యోగాలే ఉద్యోగాలు
Nuclear Devices in Himalayas : నెహ్రూ, ఇందిరాలే ప్రస్తుత ప్రకృతి విపత్తులకు కారణమా..?