
కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను తమ ప్రభుత్వం నెరవేరుస్తుందని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రకటించారు. మరీ ప్రధాని నరేంద్ర మోదీ ఎన్ని హామీలు నెరవేర్చారని ప్రశ్నించారు. కాంగ్రెస్ వాగ్దానం చేసిన ఐదు హామీలలో రెండు హామీలను నెరవేర్చుతున్నామనీ, ఈ (గృహలక్ష్మి, గృహజ్యోతి)పథకాల విషయంలో ఎలాంటి గందరగోళం లేదని, తమ ప్రభుత్వం చెప్పినట్టే చేస్తుందని సిద్ధరామయ్య శనివారం అన్నారు.
బెంగళూరులో నిర్వహించిన మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి సిద్దిరామయ్య విలేకరులతో మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోదీ ఎన్ని హామీలు నెరవేర్చారని ప్రశ్నించారు. హామీ పథకాలపై విలేకరులు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ.. మేం (రాష్ట్ర ప్రభుత్వం) ఏం చెప్పినా (ఎన్నికల వాగ్దానాలు) చేస్తామని చెప్పారు. ‘ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నో వాగ్దానాలు చేశారు. కానీ, వాటిలో ఎన్ని నెరవేర్చారు?’ అని ఆయన ప్రశ్నించారు. తన నియోజకవర్గంలో పార్టీ కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపేందుకు ఏర్పాటు చేసిన కార్యక్రమానికి హాజరవుతానని చెప్పారు.
ప్రతి ఏడాది దాదాపు రూ.50 వేల కోట్లతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మొత్తం ఐదు హామీలను అమలు చేస్తామని గతంలో సిద్ధరామయ్య ప్రకటించారు. ఈ నెల ప్రారంభంలో సిద్ధరామయ్య మాట్లాడుతూ.. "మేము సుదీర్ఘ సంప్రదింపులు చేసాము. ఇది ఈ ఆర్థిక సంవత్సరంలోనే ఇవ్వబడుతుంది" అని అన్నారు.
కర్ణాటకలో అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ హామీ ఇచ్చిన ఐదు 'ప్రధాన' హామీలు
>> అన్ని గృహాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ (గృహ జ్యోతి);
>> ప్రతి ఇంటి మహిళా పెద్దకు (గృహ లక్ష్మి) నెలవారీ సహాయం రూ. 2,000;
>> BPL కుటుంబంలోని ప్రతి సభ్యునికి 10 కిలోల బియ్యం ఉచితంగా (అన్న భాగ్య);
>> నిరుద్యోగ గ్రాడ్యుయేట్ యువకులకు నెలకు రూ. 3,000, నిరుద్యోగ డిప్లొమా హోల్డర్‌లకు (ఇద్దరూ 18-25 ఏళ్ల మధ్య ఉన్నవారు) రెండేళ్లపాటు (యువ నిధి) రూ. 1,500,
>> పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణం.