
కశ్మీర్ సమస్యలకు భారత తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ బాధ్యత వహించాలని, ఆర్టికల్ 370ని రద్దు చేయడం ద్వారా వాటిని పరిష్కరించిన ఘనత నరేంద్ర మోదీ ప్రభుత్వానిదేనని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. గుజరాత్‌లో బీజేపీ 'గౌరవ యాత్ర'ను ఫ్లాగ్ ఆఫ్ చేయడానికి ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అమిత్ షా మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ పై విమర్శాస్త్రాలు సంధించారు. అయోధ్యలో రామ మందిర నిర్మాణంపై కాంగ్రెస్ తమ పార్టీని ఎగతాళి చేసేదని, కానీ ఇప్పుడు రామ మందిర నిర్మాణంగా నిర్విఘ్నంగా కొనసాగుతోందని అన్నారు.
ఆర్టికల్ 370 వల్ల కాశ్మీర్ లో గందరగోళం నెలకొందని, దీని ప్రధాన కారణం తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ నేనని తప్పుబట్టారు. ఆయన కాలంలో కాశ్మీర్ ను దేశంతో సరిగ్గా విలీనం చేయలేకపోయారని, అందువల్ల ఇన్ని రోజులు అక్కడ ప్రజలు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నారని ఆరోపించారు. ఆర్టికల్ 370ని అందరూ తొలగించాలని కోరారనీ. ప్రధాని నరేంద్ర మోదీ క్షణికావేశంలో దాన్ని తొలగించలేదనీ, దేశంలో కాశ్మీర్‌ను విలీనం చేయడం కేంద్రం ఉద్దేశ్యమని.. ఈ పనిని మోడీ ప్రభుత్వం పూర్తి చేసిందని అన్నారు. ఈ వారం ప్రారంభంలో గుజరాత్‌లో జరిగిన ఒక సభలో ప్రధాని మోదీ ప్రసంగిస్తూ,, కాశ్మీర్ సమస్యలకు నెహ్రూ కూడా బాధ్యుడన్నారు.
ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో నిర్మితమవుతున్న రామమందిరంపై షా మాట్లాడుతూ.. రామమందిర కట్టుతామని అంటున్నారు కానీ ఆ తేదీ ఏంటో చెప్పడం లేదు' వంటి నినాదాలతో కాంగ్రెస్ బిజెపిని ఎగతాళి చేసేదని షా అన్నారు. నేడు తేదీలు ప్రకటించబడ్డాయి, శంకుస్థాపన కార్యక్రమం పూర్తయింది. మరియు వాగ్దానం చేసిన స్థలంలో అద్బుత ఆలయాన్ని నిర్మితమవుతుంది అని పేర్కోన్నారు. గతంలో గుజరాత్‌లో కర్ఫ్యూ అనేది సాధారణ సంఘటన అని, అయితే రాష్ట్రంలో మోడీ ప్రభుత్వం రాకతో నేటీకి కూడా అదే పరిస్థితులుండేవని షా అన్నారు.
గుజరాత్‌ను కాంగ్రెస్ పాలించినప్పుడు కర్ఫ్యూలు నిత్యకృత్యంగా ఉండేవని, కొన్ని ప్రాంతాల్లో సంవత్సరంలో 200 రోజులు కర్ఫ్యూ అమల్లో ఉండేదని చెప్పారు. ప్రజలు పరస్పరం పోరాడితే తమకు మేలు జరుగుతుందని వారు (కాంగ్రెస్) భావించారనీ, ఆ రోజులు నేడు పోయాయని, నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చిన 20 ఏళ్లుగా గుజరాత్‌లో ఏ ఒక్క రోజు కూడా కర్ఫ్యూ విధించలేదని పేర్కొన్నారు. ఏడాది చివరి నాటికి అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశం ఉన్న రాష్ట్రంలోని 144 నియోజకవర్గాలను కవర్ చేయడానికి బిజెపి ఐదు యాత్రలను ఎనిమిది నుండి తొమ్మిది రోజుల పాటు నిర్వహించాలని ప్లాన్ చేసింది.