ఏం జరుగుతోంది: అమిత్‌షాతో అజిత్ ధోవల్ భేటీ

Published : Aug 04, 2019, 01:50 PM ISTUpdated : Aug 04, 2019, 01:53 PM IST
ఏం జరుగుతోంది: అమిత్‌షాతో అజిత్ ధోవల్ భేటీ

సారాంశం

కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఆదివారం నాడు సెక్యూరిటీ అధికారులతో సమావేశమయ్యారు. కాశ్మీర్ లో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ఈ సమావేశానికి ప్రాధాన్యత నెలకొంది.

న్యూఢిల్లీ:కేంద్ర  హోంశాఖ మంత్రి అమిత్ షా ఆదివారం నాడు జాతీయ  భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ తో సమావేశమయ్యారు. కాశ్మీర్ లో చోటు చేసుకొన్న పరిణామాల నేపథ్యంలో ఈ సమావేశానికి ప్రాధాన్యత నెలకొంది.

జమ్మూ కాశ్మీర్ లో  అమర్ నాథ్  యాత్రను నిలిపివేశారు. యాత్రికులను కూడ తమ ప్రాంతాలకు వెళ్లిపోవాలని సూచించారు. ఉగ్రవాదులు అమర్ నాథ్ యాత్రను లక్ష్యంగా చేసుకొని దాడులు చేసే అవకాశం ఉందని ఐబీ హెచ్చరికల నేపథ్యంలో కేంద్రం  ఈ నిర్ణయం తీసుకొందని చెబుతున్నారు.

ఆదివారం నాడు మధ్యాహ్నం 12 :30 గంటలకు అమిత్ షా తో అజిత్  ధోవల్, ఇంటలిజెన్స్ చీఫ్ అరవింద్ కుమార్, రా చీఫ్ సుమంత్ గోయల్ సమావేశమయ్యారు.

కాశ్మీర్ అంశంపైనే ఈ సమావేశంలో చర్చిస్తున్నట్టుగా తెలుస్తోంది.ఈ ఏడాది ఫిబ్రవరిలో పుల్వామాలో జరిపినట్టుగానే పలు దాడులకు ఉగ్రవాదులు ప్లాన్ చేశారని ఐబీ హెచ్చరించింది.ఐబీ హెచ్చరికల నేపథ్యంలో భారీ బటగాలను జమ్మూ కాశ్మీర్ లో మోహరించినట్టుగా కేంద్ర హోంశాఖ కార్యదర్శి రాజీవ్ గౌబా ప్రకటించారు.

గత నెల 29 నుండి 31వ తేదీ మధ్య ఎల్ఐసీ వద్ద పాక్  కాల్పులకు తెగబడిందని భారత్ ప్రకటించింది. ఎల్ఐసీని దాటేందుకు ప్రయత్నించిన పాక్ కు చెందిన ఐదుగురు మృతి చెందినట్టుగా భారత్ సైన్యం తెలిపింది.

కాశ్మీర్ లో సుమారు 35 వేల .పారా మిలటరీ బలగాలను మోహరించారు. కాశ్మీర్ పై కేంద్రం కీలక నిర్ణయం తీసుకొనే అవకాశం ఉందని చెబుతున్నారు.సోమవారం నాడు ఉదయం కేంద్ర కేబినెట్ సమావేశం కానుంది.ఈ సమావేశంలో జమ్మూ కాశ్మీర్ అంశమే ఎజెండా కానుందని సమాచారం.

సంబంధిత వార్తలు

తెల్లజెండాలతో వచ్చి సైనికుల మృతదేహాలు తీసుకెళ్లండి: పాక్‌కు భారత్ ఆఫర్

భారత భూభాగంలోకి చొరబడేందుకు యత్నం: ఏడుగురు పాక్ సైనికులు హతం

ఐబీ సూచనల మేరకే: జమ్మూ పరిస్థితిపై కిషన్ రెడ్డి

PREV
click me!

Recommended Stories

Sri Sathya Sai University: దేశంలోనే తొలిసారి 138 మంది రైతులకు ‘కృషి - ఋషి’ పట్టాలు.. హిస్టరీ క్రియేట్ శ్రీ సత్యసాయి యూనివర్శిటీ
సీఎం విజయ్ సింప్లిసిటీకి నెటిజన్లు ఫిదా| CM Joseph Vijay Travels in Chennai Metro with Common People