
PM Narendra Modi speaks about Arunachal Pradesh: అరుణాచల్ ప్రదేశ్ లో అభివృద్ధి పనుల గురించి కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేసిన ట్వీట్ కు ప్రధాన మంత్రి స్పందించారు. అరుణాచల్ ప్రదేశ్ అభివృద్ది దిశగా ముందుకు సాగుతోందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. తమ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులు అరుణాచల్ ప్రదేశ్ లోని మారుమూల ప్రాంతాల్లో నివసించే ప్రజల జీవన నాణ్యతను మెరుగుపరుస్తాయని చెప్పారు.
కాగా, కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఒక ట్వీట్ లో అరుణాచల్ ప్రదేశ్ లోని కిబితూ వద్ద ఐటీబీపీని ప్రారంభించిన అనేక పథకాలతో పాటు 9 మినీ మైక్రో హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టులను ప్రారంభించినట్లు తెలియజేశారు. మహిళా నేతృత్వంలోని స్వయం సహాయక సంఘాలు నిర్వహించిన ఎగ్జిబిషన్ లోనూ ఆయన పాల్గొన్నారు.
ఇదిలావుండగా, అరుణాచల్ ప్రదేశ్ నుంచి కేంద్ర హోం మంత్రి అమిత్ షా సోమవారం చైనాకు బలమైన సందేశాన్ని పంపారు. భారతదేశం తన భూభాగంలో ఒక్క అంగుళం కూడా ఆక్రమించుకోనివ్వదని పేర్కొన్నారు. అయితే, కేంద్ర మంత్రి పర్యటన తమ సార్వభౌమత్వాన్ని ఉల్లంఘిస్తుందని, సరిహద్దు ప్రాంతాల్లో శాంతికి హానికరమని చైనా ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై స్పందించిన అమిత్ షా.. "మన ఆర్మీ, ఐటీబీపీ సైనికుల ధైర్యసాహసాల వల్ల దేశ సరిహద్దులను ఎవరూ సవాలు చేయలేరు. తమ భూమిని ఎవరైనా ఆక్రమించుకునే సమయం పోయింది. ఇప్పుడు 'సూయి కీ నోక్'(సూదిపాయింట్)కు సమానమైన భూమిని కూడా ఆక్రమించడానికి వీల్లేదు. మా విధానం స్పష్టంగా ఉంది. మేము అందరితో శాంతియుతంగా జీవించాలనుకుంటున్నాము, కానీ మా భూమిని ఒక్క అంగుళం కూడా ఆక్రమణకు అనుమతించము" అని అరుణాచల్ ప్రదేశ్ లోని అంజావ్ జిల్లాలోని ఎల్ఎసీకి సమీపంలో భారతదేశపు మొదటి గ్రామమైన కిబితూలో 'వైబ్రెంట్ విలేజెస్ ప్రోగ్రామ్"(వీవీపీ) ను ప్రారంభించిన సందర్భంగా అమిత్ షా అన్నారు.