కేసీఆర్ సూపరంటూ... అమిత్ షా ప్రశంసలు

By telugu news teamFirst Published Mar 23, 2020, 12:32 PM IST
Highlights

మంచి పని చేయాలని కోరితే ఎద్దేవా చేస్తారా? అంటూ మండిపడ్డారు. సోషల్ మీడియాలో ప్రధాని మోదీని కించపరించే పోస్టులు పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 
 

కరోనా మహమ్మారిని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగానే ఆదివారం ఉదయం 7గంటల నుంచి జనతా కర్ఫ్యూ విధించారు. అయితే... ఇలాంటి ప్రాణాంతక పరిస్థితుల్లోనూ తమ ప్రాణాలను పణంగా పెట్టి వైద్యులు, పోలీసులు, జర్నలిస్టులు సేవలు చేస్తున్నారు. వారి కృషిని గుర్తించి సాయంత్రం 5గంటలకు చప్పట్లతో సంఘీభావం ప్రకటించండి అంటూ మోదీ ప్రకటించిన సంగతి తెలిసిందే.

అయితే.. ఆ చప్పట్ల కాన్సెప్ట్ పై చాలా మంది కామెంట్స్ చేశారు. సోషల్ మీడియాలో మోదీ చేసిన ప్రకటనపై చాలా మంది ట్రోల్ చేశారు. అయితే... ఈ విషయంలో కేసీఆర్ మండిపడ్డారు. మంచి పని చేయాలని కోరితే ఎద్దేవా చేస్తారా? అంటూ మండిపడ్డారు. సోషల్ మీడియాలో ప్రధాని మోదీని కించపరించే పోస్టులు పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 

Also Read తెలంగాణ లాక్ డౌన్... ఈ సేవలు మాత్రం అందుబాటులోనే...

అంతే కాకుండా.. కర్ఫ్యూ సమయాన్ని కూడా పెంచేశారు. అనకున్నట్లుగానే రాష్ట్ర ప్రజలు కాలు గడప దాటనీయకుండా జగ్రత్తలు తీసుకున్నారు. ఎమర్జన్సీ తప్ప.. మిగతావారు రోడ్లపై కనిపిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు కూడా సూచించారు.

దీంతో ఏ ఏరియా చౌరస్తా దగ్గర చూసినా.. ఖాకీలే కనిపించారు. ప్రజలకు అత్యవసరమైతే తప్ప బయటకి రాకుండా పక్బందీగా చర్యలు తీసుకున్నారు. అంతే కాకుండా.. కుటుంబంతో ప్రగతి భవన్‌ బయటకి వచ్చి చప్పట్లతో సంఘీభావం ప్రకటించారు సీఎం. ఇలా.. తనేంటో మరోసారి నిరూపించుకున్నారు. 

అలాగే ప్రజలకు తగిన సూచనలు కూడా జారీ చేశారు. దీంతో దీనిపై కేంద్రం సంతోషం వ్యక్తం చేసింది. ఏకంగా కేంద్ర హోంమంత్రి, ప్రధాని మోదీ తర్వత బీజేపీలో పెద్ద నేత అమిత్‌ షానే స్వయంగా కేసీఆర్‌కు ఫోన్ చేశారు. తెలంగాణ ప్రజల స్ఫూర్తిని, ప్రభుత్వ యంత్రాంగ కార్యాచరణను మెచ్చుకున్నారు. కర్ఫ్యూని విజయవంతం చేయడంలో తెలంగాణే దేశంలో ముందు వరుసలో నిలిచిందని ప్రశంసించారు.

click me!