కరోనా ఎఫెక్ట్: సుప్రీంకోర్టు లాక్ డౌన్, వారానికి ఒక్క రోజే....

By narsimha lodeFirst Published Mar 23, 2020, 12:15 PM IST
Highlights

కరోనా ఎఫెక్ట్ కారణంగా సుప్రీంకోర్టు లాక్ డౌన్ ప్రకటించింది. సోమవారం నాడు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్  కీలక ఆదేశాలు జారీ చేవారు. వారానికి ఒక్క రోజు మాత్రమే సుప్రీంకోర్టును తెరిచి ఉంచాలని సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకొంది.

న్యూఢిల్లీ: కరోనా ఎఫెక్ట్ కారణంగా సుప్రీంకోర్టు లాక్ డౌన్ ప్రకటించింది. సోమవారం నాడు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్  కీలక ఆదేశాలు జారీ చేవారు. వారానికి ఒక్క రోజు మాత్రమే సుప్రీంకోర్టును తెరిచి ఉంచాలని సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకొంది.

వీడియో కాన్పరెన్స్ ద్వారానే పిటిషన్లపై విచారణ చేయాలని సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకొంది. అత్యవసరమైతే తప్ప కొత్త పిటిషన్లను స్వీకరించబోమని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ప్రకటించారు.
అత్యవసర కేసులను కూడ వీడియో కాన్పరెన్స్ ద్వారా విచారణ చేయనున్నారు.

ఈ నెల 24వ తేదీ సాయంంత్రం లోపుగా లాయర్లు కూడ తమ చాంబర్లను కూడ ఖాళీ చేయాలని సుప్రీంకోర్టు సోమవారం నాడు ఆదేశించారు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ నేతృత్వంలోని కోర్టు మాత్రమే సోమవారం నాడు పని చేయనుంది.

మిగిలిన కోర్టులు సోమవారం నుండి పనిచేయవు. ఈ ఏడాది ఏప్రిల్ 4వ తేదీ వరకు ఇదే రకమైన పరిస్థితి ఉంటుందని సుప్రీం ఆదేశాలు జారీ చేసింది.

click me!