వరదలు, వర్షాలతో అతలాకుతలం: ఉత్తరాఖండ్‌లో అమిత్ షా ఏరియల్ సర్వే.. సహాయక చర్యలపై ఆరా

By Siva KodatiFirst Published Oct 21, 2021, 4:04 PM IST
Highlights

భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలమైన ఉత్తరాఖండ్‌లో (Uttara Khand) ఏరియల్ సర్వే నిర్వహించారు కేంద్ర హోంమంత్రి అమిత్‌షా (amit shah). సీఎం పుష్కర సింగ్‌ ధామీ (pushkar singh dhami), గవర్నర్‌ లెఫ్టినెంట్‌ జనరల్‌ గుర్మీత్‌ సింగ్‌ (gurmeet singh) తో కలిసి ఆయన గురువారం వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించారు

భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలమైన ఉత్తరాఖండ్‌లో (Uttara Khand) ఏరియల్ సర్వే నిర్వహించారు కేంద్ర హోంమంత్రి అమిత్‌షా (amit shah). సీఎం పుష్కర సింగ్‌ ధామీ (pushkar singh dhami), గవర్నర్‌ లెఫ్టినెంట్‌ జనరల్‌ గుర్మీత్‌ సింగ్‌ (gurmeet singh) తో కలిసి ఆయన గురువారం వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించారు. ఎన్నడూ లేని విధంగా ఉత్తరాఖండ్‌లో (uttara khand floods) నాలుగు రోజుల పాటు ఎడతెరిపి లేకుండా కురిసిన కుండపోత వర్షాలకు 52 మంది మృత్యువాత పడ్డారు.

ఇక కుండపోత వానలు, వరదల ధాటికి కుదేలైన ఉత్తరాఖండ్‌లో సహాయకచర్యలు చేపట్టింది రెస్క్యూ టీమ్‌. భారత వాయుసేనకు (indian airforce) చెందిన మూడు హెలికాఫ్టర్లు సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. విరిగిపడిన కొండచరియలను తొలగిస్తున్నారు. మరోవైపు మృతుల కుటుంబాలకు 4 లక్షల రూపాయల చొప్పున పరిహారం ప్రకటించారు సీఎం పుష్కరసింగ్‌ ధామీ. పంటనష్టంపై నివేదిక సమర్పించాలని ఆయన కలెక్టర్లను ఆదేశించారు. రాష్ట్రానికి భారీగా నష్టం వాటిల్లిందని..కోలుకోవడానికి సమయం పడుతుందని తెలిపారు. సహాయక చర్యల నిమిత్తం ప్రతి జిల్లాకు 10 కోట్లు చొప్పున మంజూరు చేశారు. రాష్ట్ర పరిస్థితులపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ (narendra modi), కేంద్ర హోం మంత్రి అమిత్ షాలు రాష్ట్ర ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామితో ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. కేంద్ర హోం శాఖ కార్యదర్శి అజయ్ భల్లా సీఎంతో మాట్లాడి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. 

Also Read:ఉత్తరాఖండ్ ని ముంచెత్తిన వరదలు.. పరిస్థితి ఆరా తీసిన ప్రధాని..!

మంగళవారం ఒక్క రోజే 11 మంది మరణించారు. ఇందులో ఏడుగురు ముక్తేశ్వర్, ఖైరానా ఏరియాలో ఇళ్లు కూలి మరణించారు. మరొకరు ఉధమ్ సింగ్ నగర్‌లో వరద నీటిలో కొట్టుకుపోయి ప్రాణాలు కోల్పోయారు. సోమవారం ఐదుగురు మరణించారు. ఇందులో ముగ్గురు నేపాల్‌కు చెందిన లేబర్లు ఉన్నారు. కొంద ప్రాంతం నుంచి వరదతోపాటు కొట్టుకువచ్చిన చిత్తడి వీరిని సజీవంగా సమాధి చేసిందని తెలిసింది. మరో ఇద్దరు చంపావత్ జిల్లాలో ఇల్లు కూలిపోయి మరణించారు. ఇదే జిల్లాలో నిర్మాణంలో ఉన్న బ్రిడ్జీ వరదలకు కొట్టుకుపోయింది.

టూరిస్టులకు కేంద్రస్థానంగా ఉండే నైనితాల్ పరిస్థితి దారుణంగా ఉన్నది. Floods ఉధృతి, కొండచరియలు విరిగిపడటంతో నైనితాల్‌ను రాష్ట్రంతో కలిపే మూడు దారులూ మూసుకుపోయాయి. ఇప్పుడు నైనితాల్‌ రాష్ట్రంతో సంబంధాలు కోల్పోయింది. కాలాధుంగి, హల్ద్వాని, భవాలీ నగరాలకూ కలిపే రోడ్లు కొండ చరియల శిథిలాలతో ధ్వంసమైపోయాయి. ఐకానిక్ నైనితాల్ సరస్సు ఉప్పొంగుతున్నది. 24 గంటల్లో 500 మి.మీల వర్షం కురవడంతో నైనితాల్‌లో నీటిమట్టం రికార్డుస్థాయికి పెరిగింది.

click me!