కుప్పకూలిన వాయుసేన జెట్ ఫైటర్: పైలెట్ సురక్షితం

Published : Oct 21, 2021, 03:53 PM ISTUpdated : Oct 21, 2021, 05:08 PM IST
కుప్పకూలిన వాయుసేన జెట్ ఫైటర్: పైలెట్ సురక్షితం

సారాంశం

మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని బింద్ జిల్లాలోని మన్కడ్ ప్రాంతంలో మిరాజ్ 2000 జెట్ విమానం గురువారం నాడు కుప్పకూలింది.ఈ ప్రమాదం నుండి పైలెట్ సురక్షితంగా బయటపడ్డాడు.

న్యూఢిల్లీ: ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు చెందిన మిరాజ్ 2000 ఫైటర్ జెట్ విమానం  గురువారం నాడు కుప్పకూలింది. శిక్షణ సమయంలో విమానం కుప్పకూలిందని వాయుసేన ప్రకటించింది. ఈ ప్రమాదం నుండి పైలెట్ సురక్షితంగా బయటపట్టాడు. అయితే ప్రమాదానికి పూర్తి కారణాలు తెలియాల్సి ఉంది. ఈ ప్రమాదంపై విచారణకు ఆదేశించామని  IAF ఒక ప్రకటనలో తెలిపింది.

 

also read:అబ్బురపరిచే రాఫేల్ జెట్ విన్యాసాలు.. తొలిసారిగా చిత్రాలు విడుదల చేసిన వైమానిక దళం

Madhya Pradesh రాష్ట్రంలోని Bhind కు సమీపంలోని Mankabad గ్రామంలో విమానం కుప్పకూలింది. ఈ విమానం కుప్పకూలే సమయంలో కొందరు తమ ఫోన్లలో ఈ దృశ్యాలను రికార్డు చేశారు.. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో రికార్డయ్యాయి.  విమానం కూలిపోయే సమయంలో  పైలెట్  Parachute సహాయంతో విమానం నుండి బయటపడిన దృశ్యాలు కూడ ఈ వీడియోలో కన్పించాయి.భారీ శబ్దంతో విమానం నేలపై కుప్పకూలడంతో స్థానికులు భయాందోళనలు చెందారు. జెట్ ఫైటర్ కుప్పకూలిన విషయం తెలుసుకొన్న స్థానికులు పెద్ద ఎత్తున  విమానం కూలిన ప్రదేశానికి చేరుకొన్నారు.

 

శిక్షణ విమానం ఇవాళ ఉదయం సెంట్రల్ సెక్టార్ నుండి గాల్లోకి ఎగిరింది. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే  విమానం కుప్పకూలిందని వాయుసేన ప్రకటించింది. వేగంగా విమానం వచ్చి నేలలో కూరుకుపోయింది. ఈ ప్రాంతాన్ని పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకొన్నారు.

PREV
click me!

Recommended Stories

Bullet Train India: దూసుకొస్తున్న బుల్లెట్ ట్రైన్.. హైదరాబాద్, అమరావతి రూట్లలో గంటలో ప్రయాణం
Zero Poverty Mission : యూపీలో పేదరికంపై యోగి ప్రభుత్వ నిర్ణయాత్మక పోరాటం