కాషాయ వస్త్రాల్లో కుంభమేళాకు వచ్చిన ఐసిసి ఛైర్మన్ జై షా

Published : Jan 27, 2025, 10:41 PM IST
కాషాయ వస్త్రాల్లో కుంభమేళాకు వచ్చిన ఐసిసి ఛైర్మన్ జై షా

సారాంశం

కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రయాగరాజ్‌లోని అక్షయవట దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కుటుంబ సమేతంగా షా అక్షయవట ప్రదక్షిణ చేసారు. 

మహా కుంభనగర్ : కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మహా కుంభనగర్‌లోని అక్షయవటను దర్శించుకున్నారు. ముఖ్యమంత్రి యోగి ముందుగానే అక్కడికి చేరుకుని అమిత్ షా ఫ్యామిలీకి స్వాగతం పలికారు. అనంతరం ప్రధాన పూజారి వేద మంత్రోచ్ఛారణల నడుమ పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అమిత్ షా అక్షయవటకు హారతి ఇచ్చి, యోగితో కలిసి పుష్పాలు సమర్పించారు.

అక్షయవట ప్రదక్షిణ

సాధువులతో కలిసి అమిత్ షా, యోగి అక్షయవట ప్రదక్షిణ చేస్తూనే మహా కుంభమేళా ఏర్పాట్లపై చర్చించారు. అమిత్ షా తన కుటుంబ సభ్యులతో కలిసి అక్షయవట పూజలో పాల్గొన్నారు. ఆయన సతీమణి సోనాల్ షా, కుమారుడు జై షా, కోడలు, మనవరాళ్ళు కూడా ఈ పూజలో పాల్గొన్నారు. పూజ అనంతరం షా కుటుంబం చెట్టు ముందు నిల్చుని గ్రూప్ ఫోటో దిగారు. ఈ సందర్భంగా అక్షయవట వద్ద సాధువులతో కలిసి మహా కుంభమేళా ఏర్పాట్లపై చర్చించారు.

ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ఛైర్మన్ జై షా ఎప్పుడూ సూటుబూటులోనే కనిపిస్తారు. అలాంటి ఆయన కూడా కుంభమేళాలో కాషాయం కట్టారు. ఇలా కాషాయ దుస్తుల్లో ఆయన సరికొత్తగా కనిపించారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

గంటకు 9 కి.మీ స్పీడ్, 46 కి.మీ ప్రయాణానికి 5 గంటలా..! దేశంలోనే స్లోయెస్ట్ ట్రైన్ ఏదో తెలుసా?
Weather Update : మళ్లీ భారీ వర్షాలు.. ఈ ప్రాంతాలకు ఐఎండీ అలర్ట్ !