
india republic day: భారతదేశం తన 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా జనవరి 26, 2025న గొప్ప వేడుకలను జరుపుకుంటోంది. ఉత్సవ పరేడ్‌కు ముఖ్య అతిథిగా వచ్చే ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో సమక్షంలో న్యూఢిల్లీలోని కర్తవ్య పథంలో వేడుకలు జరుగుతున్నాయి.
1950లో ఈ చారిత్రాత్మకమైన రోజున అమల్లోకి వచ్చిన భారత రాజ్యాంగం 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్నందున ఈ జనవరి 26 రిపబ్లిక్ డేను జరుపుకుంటున్నాము. ఈ క్రమంలోనే భారత ప్రధాని నరేంద్ర మోడీ భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రాజ్యాంగంలోని ఆదర్శాలను పరిరక్షించే ప్రయత్నాలను బలోపేతం చేయాలని ఆకాంక్షించారు.
గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ.. నేడు మనం గణతంత్రంగా 75 వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నామనీ, మన రాజ్యాంగాన్ని రూపొందించిన, మన ప్రయాణం ప్రజాస్వామ్యం, గౌరవం, ఐక్యతపై ఆధారపడి ఉండేలా చూసుకున్న మహనీయులందరికీ నమస్కరిస్తున్నాని తెలిపారు.
గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు మనం రిపబ్లిక్‌గా 75 అద్భుతమైన సంవత్సరాలను జరుపుకుంటున్నాము. మన రాజ్యాంగాన్ని రూపొందించిన, ప్రజాస్వామ్యం, గౌరవం-ఐక్యతతో మా ప్రయాణం పాతుకుపోయేలా చేసిన గొప్ప మహనీయులందరికీ మేము నమస్కరిస్తున్నాము. మన రాజ్యాంగ ఆదర్శాలను పరిరక్షించడానికి, బలమైన-సుసంపన్నమైన భారతదేశం వైపు పని చేయడానికి మన ప్రయత్నాలను బలోపేతం చేద్దాం - భారత ప్రధాని నరేంద్ర మోడీ
కర్తవ్య పాత్ (గతంలో రాజ్‌పాత్ అని పిలిచేవారు) వద్ద గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుగుతాయి, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతీయ యుద్ధ స్మారక చిహ్నం వద్ద నివాళి అర్పించడంతో ప్రారంభమవుతుంది, తరువాత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జాతీయ జెండాను ఎగురవేస్తారు. ఈ సంవత్సరం, ఇండోనేషియా నూతన్వంగా ఎన్నికైన అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో ముఖ్య అతిథి. ఈ కార్యక్రమంలో ఆయన ఇండోనేషియా బృందానికి నాయకత్వం వహిస్తారు.