
భారత దేశానికి ముస్లింల రాక ముహమ్మద్ బిన్ ఖాసింతో మొదలైంది. క్రీస్తు శకం 720లో ముహమ్మద్ బిన్ ఖాసిం సింధ్‌పై దాడి చేసినా.. ఆయన దీర్ఘకాలం ఇక్కడ ఉండలేదు. తిరిగి స్వదేశానికి వెళ్లిపోయాడు. అయితే, 1001 సంవత్సరం నుంచి మహ్ముద్ ఘాజ్నవితో ముస్లింల రాక నిలకడగా సాగంది. ఆయన కేవలం దోచుకెళ్లాలనే లక్ష్యంతోనే ఇక్కడికి వచ్చాడు. భారత్ పై 17 సార్లు దాడి చేశాడు.
మహ్ముద్ ఘాజ్నవి తర్వాత షాహబుద్దీన్ గౌరీ, తైముర్లాంగ్, నాదిర్ షా, అహ్మద్ షా అబ్దాలి వంటి వారు వచ్చారు. వారు ఇండియాపై దాడి చేసి విలువైన నగలు, ఇతర వాటిని దోచుకుని తిరిగి వెళ్లిపోయారు. అయితే, వీరితోపాటు పర్షియా, అరేబియాల నుంచి వచ్చిన సూఫీ సన్యాసులు, ఎందరో ముస్లింలు ఇక్కడే ఉండిపోయారు.
అందులో ప్రముఖులు ఖ్వాజా మొయినుద్దీన్ చిష్తీ అజ్మేరీ. చిష్తియా ఆర్డర్‌కు చెందిన గొప్ప గురువు. 850 ఏళ్ల క్రితం ఇండియాకు వచ్చారు. అజ్మేర్‌లో చిష్తియా ఆర్డర్ స్థాపించారు. భారత ఉపఖండంలో చిష్తియా ఆర్డర్‌కు చెందిన సూఫీ సన్యాసి సమాధి లేని జిల్లా లేదని చెప్పడం అతిశయోక్తి కాదు.
మహ్ముద్ ఘాజ్నవి వెంట వచ్చిన ప్రసిద్ధ చరిత్రకారుడు అల్బెరుని కితాబుల్ హింద్ అనే పుస్తకం రాశారు. ఇండియాను వర్ణించిన తొట్టతొలి డాక్యుమెంట్‌గా దీన్ని పేర్కొంటారు. ఈ పుస్తకంలో ఆయన భారత నాగరికత, సంస్కృతి, జీవన ప్రమాణాలను, ఈ దేశ ప్రజలను గురించి రాశారు.
సూఫీ సన్యాసి ఖవాజా ఆమిర్ ఖుస్రో హిందుస్తానియత్ పిత అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. గత 800 భారత చరిత్రలో సంస్కృతి, నాగరికతను వృద్ధి చేసిన వారి జాబితాలో హజ్రత్ అబుల్ హసన్ యమినుద్దీన్ ఖుస్రో తప్పకుండా అగ్రశ్రేణిలో ఉంటారు.
ప్రజలు ప్రేమగా ఆయనను ఆమిర్ ఖుస్రో దేల్వి అని, తుతీ ఈ హింద్ అని పిలుచుకుంటారు. తనను తాను ఆయన టర్క్ హిందుస్తానియం హిందవీ గోయల్ జవాబ్ అని పిలుచుకుంటారు. అంటే.. హిందీ భాష తెలిసి మాట్లాడగలిగిన టర్క్ హిందుస్తానీ అని అర్థం. ఈ ఉపఖండానికి ఆయన అందమైన పేరు హిందుస్తాన్ అని ఇచ్చారు. ఇప్పుడు హిందీ అని పిలుచుకునే హింద్విని ఇచ్చారు. హింద్వీ భాషలోనే ఇప్పుడు పిలిచే ఉర్దూ కూడా మిళితమై ఉంటుంది.
1970లో ప్రముఖ ఉర్దూ కవి జాన్ నిసార్ అక్తర్ ఉర్దూ కవితలు హిందొస్తాన్ హమారా కలెక్షన్ ఎడిట్ చేశారు. ఆ పుస్తక పరిచయంలో అరబిక్, పర్షియన్, టర్కిష్ పదాల మిళిత ఆమిర్ ఖుస్రో ఖారి బోలీ అని పేర్కొన్నారు. దాన్ని రేఖ్తా అని, అదే తదనంతరం కొత్త భారతీయ భాష అంటే హంిందీ లేదా హింద్వీకి పుట్టుకనిచ్చింది. ఆ తర్వాత అది ఉర్దుగా పరిణామం చెందింది.
ఆమిర్ ఖుస్రో ఈ భాష కొత్త రూపం ఇచ్చాడు. ఒక వైపు పర్షియన్ భాషను తన కవితల్లో పర్షియన్, హింద్వీ, ఉర్దూ భాషలను రాశారు. మరో వైపు అవధ్, బ్రజ్‌భాషలను కవితలను కంపోజ్ చేయడానికి వినియోగించుకున్నాడు కూడా.
భారత క్లాసికల్ మ్యూజిక్‌కు ఆమిర్ ఖుస్రో సితార్, తబలాను బహుమానంగా ఇచ్చారు. ఆయన తన కవిత పర్షియన్, హిందీ భాషల్లో ఘజల్, మాస్నవి, కత, రుబాయి, దొబాయితీ, తరక్కీ బంద్ వంటి రూపాల్లో రాశారు. వీటికితోడు అసంఖ్యాక పాటలు, రిడిల్స్ తరానా, కప్లెట్స్ సహా మరెన్నో రాశారు.
Also Read: భారత్ నా దేశం; ఇస్లాం నా మతం
ఆమిర్ ఖుస్రో భారత్ ముఖ్యంగా ఢిల్లీని ఎక్కువగా పొగిడారు. అవధ్ గురించి కూడా రాశారు. ‘ఈ ప్రపంచంలో పూలు, పళ్లు ఉన్నాయి. ఇక్కడి ప్రజల భాష ఎంత మంచిదో, తియ్యనైన మరియు కలర్ఫుల్ ప్రజలు వీరు. ఈ భూమి సంతోషంగా ఉన్నది. భూస్వామి ధనికుడిగా ఉన్నాడు. అందుకే నేను అవధ్‌ను విడదీయాలని భావించడం లేదు. కానీ, ఢిల్లీ నా దేశం, నా నగరం, ప్రపంచంలోనే అత్యంత సుందరమైన నగరం’ అని పేర్కొన్నారు.
ముఘల్ చక్రవర్తి జహీరుద్దీన్ బాబు ముఘల్ సమ్రాజ్యాన్ని స్థాపించారు. ఆయన ముని మనవడు జలాలుద్దీన్ ముహమ్మద్ అక్బర్‌ను అక్బర్ ఎ ఆజాం, షెహెన్షా అక్బర్, మహాబలి, షెహెన్షా అని కూడా పిలుచుకుంటారు. అక్బర్ కాలంలో ఉత్తర, మధ్య భారతాల్లో చాలా ప్రాంతాలు ముఘల్ సామ్రాజ్యంలో చేరిపోయాయి. ఆయన రాజదర్బారులో ముస్లింల కంటే హిందువుల ఎక్కువ మంది కోవిదులు ఉండేవారు.
125 ఏళ్ల ముఘల్ పాలనలో భారత్ అనూహ్యంగా అభివృద్ధి చెందింది. కవుల్లో మీర్ తాఖి మీర్, ఘాలిబ్, మిర్ అనీస్‌లు ఈ కాలంలోనే పుట్టారు. ప్రపంచవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు. అల్లామా ఇక్బాల్ సారే జహా సే అచ్చా రాశారు. 19వ శతాబ్దంలో సంఘ సంస్కర్త, విద్యావేత్త సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ ఒక మారు ఇలా అన్నారు. భారత్ ఒక అందమైన వధువు అయితే.. అందులో హిందువులు, ముస్లింలు చెరో కన్ను. అందులో ఏ ఒక్క కన్ను స్పాయిల్ అయినా.. వధువు అందవిహీనంగా మారిపోతుంది.
ఓ సారి మాట్లాడుతూ.. మీరు ఇక్కడి నీరు తాగరా? ఇక్కడ పుట్టలేదా? ఇక్కడి ఆహారం తినరా.. ఇక్కడే మీరు సమాధి కారా? మీరు వేరే ఇతర దేశ నివాసులా? అంటూ ప్రశ్నించారు. దేశం పై ప్రేమను స్పష్టం చేశారు. 1875లో ఆయన అలీగడ్ యూనివర్సిటీ స్థాపించారు. మౌలానా మొహమ్మద్ అలీ జోహార్, మౌలానా షౌకత్ అలీ, ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్, మౌలానా హస్రత్ మొహాని, రాజా మహేంద్ర ప్రతాప్, సైఫుద్దీన్ కిచ్లూ, జాకిర్ హుస్సేన్, రఫీ అహ్మద్ కిద్వాయ్, షేక్ అబ్దుల్లాల వంటి జాతీయ నేతలను సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ ఇచ్చారు. అలీ సర్దార్ జాఫ్రి, కైఫి అజ్మి, ఖ్వాజా అహ్మద్ అబ్బాస్, రహీ మసూమ్ రాజా, జావేద్ అక్తర్ వంటి అద్భుత రచయితలు, కవులను ఇచ్చింది.
భారత ముస్లింలకు భారత్ అంటనే ఇష్టం. మిగితా పౌరుల్లాగే వారూ భారత్‌లోని మంచి,చెడులను చూసి ఉన్నారు. అన్నింటిలో పాలుపంచుకున్నారు.
పాకిస్తాన్ సృష్టిస్తున్న సయమంలో దేశంలోని మెజారీ మస్లింలు ఇక్కడే ఉండిపోవాలని నిర్ణయం తీసుకున్నారు. అందుకే ప్రపంచంలో అత్యధిక ముస్లిం జనాభా గల ఇండోనేషియా తర్వాత రెండో స్థానంలో భారత దేశమే ఉన్నది.
--- ఖుర్బాన్ అలీ (గతంలో బీబీసీ ఉర్దులో కలిసి పని చేశారు.)