జూన్ 30 నుంచి అమర్‌నాథ్ యాత్రకు గ్రీన్ సిగ్నల్.. 43 రోజులపాటు యాత్ర

Published : Mar 27, 2022, 06:05 PM IST
జూన్ 30 నుంచి అమర్‌నాథ్ యాత్రకు గ్రీన్ సిగ్నల్.. 43 రోజులపాటు యాత్ర

సారాంశం

జూన్ 30వ తేదీ నుంచి అమర్‌నాథ్ యాత్రను నిర్వహించనున్నట్టు జమ్ము కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా వెల్లడించారు. ఈ యాత్ర 43 రోజులపాటు సాగుతుందని, రక్షా బంధన్ రోజున ముగుస్తుందని వివరించారు. అన్ని కరోనా నిబంధనలను పాటిస్తూ ఈ యాత్ర చేపట్టనున్నట్టు తెలిపారు.  

న్యూఢిల్లీ: అమర్‌నాథ్ యాత్రపై అదిరిపోయే అప్‌డేట్ వచ్చింది. జూన్ 30వ తేదీ నుంచి అమర్‌నాథ్ యాత్ర నిర్వహించనున్నట్టు జమ్ము కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా వెల్లడించారు. ఈ యాత్ర 43 రోజుల పాటు సాగనున్నట్టు తెలిపారు. శ్రీ అమర్‌నాథ్ దేవస్థానం బోర్డు‌తో నిర్వహించిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆయన ట్వీట్ చేశారు. ప్రతి యేడాది అమర్‌నాథ్ యాత్ర నిర్వహిస్తుండేవారు. కానీ, జమ్ము కశ్మీర్‌కు ప్రత్యేక హోదా కల్పించే అధికరణాలను తొలగించిన 2019లో ఈ యాత్రను అర్ధంతరంగా ముగించారు. ఆ తర్వాత కూడా కరోనా కారణంగా ఈ యాత్రను నిర్వహించలేదు. కేవలం సింబాలిక్‌గా పాటించారు.

జమ్ము కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ఈ రోజు ట్విట్టర్‌లో ఈ విషయాన్ని వెల్లడించారు. శ్రీ అమర్‌నాథ్‌జీ ష్రైన్ బోర్డు సమావేశాన్ని ఈ రోజు నిర్వహించామని తెలిపారు. అన్ని కరోనా నిబంధనలతో 43 రోజులపాటు సాగే ఈ అమర్‌నాథ్ యాత్రను జూన్ 30 నుంచి ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నామని వివరించారు. ఎప్పట్లాగే సాంప్రదాయంగా ప్రకారం రాఖీ పౌర్ణమి రోజున ఈ యాత్ర ముగుస్తుందని పేర్కొన్నారు. ఈ యాత్ర గురించిన ఇతర అంశాలపై లోతుగా చర్చించామని లెఫ్టినెంట్ గవర్నర్ కార్యాలయం ట్వీట్ చేసింది.

శ్రీ అమర్‌నాథ్‌జీ దేవస్థానం బోర్డు 2000లో ఏర్పాటు చేశారు. ఈ బోర్డుకు జమ్ము కశ్మీర్ గవర్నర్ ఎక్స్ అఫీషియో చైర్మన్‌గా ఉన్నారు. లక్షలాది మంది భక్తులు ఈ యాత్రలో పాల్గొంటారు. కఠోర శీతోష్ణస్థితుల మధ్య వారు తమ యాత్రను చేపడతారు. దక్షిణ కశ్మీర్‌లోని అమర్‌నాథ్ ఆలయాన్ని చేరుకుని అక్కడ మంచుతో నిర్మితమైన లింగాన్ని దర్శించుకుంటారు. శివునికి తమ మొక్కులు అప్పజెప్పి వెనుదిరుగుతారు.

PREV
click me!

Recommended Stories

PM Modi Italy Tour Highlights: మోదీ విజన్ కి ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఫిదా| Asianet News Telugu
PM Modi Oslo Visit: ఒస్లో పర్యటనలో మోదీకి అదిరిపోయే స్వాగతం| Asianet News Telugu