ఢిల్లీలోని జీబీ రోడ్‌లో సెక్స్ వర్కర్ హత్య కేసులో ఇద్దరు సోదరులు, స్నేహితుడి అరెస్ట్

Published : Apr 01, 2023, 09:35 AM IST
ఢిల్లీలోని జీబీ రోడ్‌లో సెక్స్ వర్కర్ హత్య కేసులో ఇద్దరు సోదరులు, స్నేహితుడి అరెస్ట్

సారాంశం

సెక్స్ వర్కర్ ను హత్య చేసి పారిపోయిన కేసులో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిలో ఇద్దరు అన్నాదమ్ములు కాగా.. మరొకరు వారి స్నేహితుడు. 

న్యూఢిల్లీ : మార్చి 7న జిబి రోడ్‌లో సెక్స్ వర్కర్‌ను హత్య చేసిన కేసులో 19, 20 సంవత్సరాల వయస్సు గల ఇద్దరు సోదరులను.. వారితో పాటు వారి 22 ఏళ్ల స్నేహితుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ముగ్గురూ తూర్పు ఢిల్లీలోని ఒక దుకాణాన్ని దోచుకోవాలనుకున్నారని, ప్లాన్ అమలు చేయడానికి ముందు, వారు ఒక వ్యభిచార గృహానికి వెళ్లారని, అక్కడ చెల్లింపు విషయంలో ఘర్షణ చెలరేగిందని విచారణలో తేలింది. పారిపోయే ప్రయత్నంలో భాగంగా, ఈ ముగ్గురు వ్యక్తులు మహిళ, ఆమె పింప్‌పై కాల్పులు జరిపారు.

సెక్స్ వర్కర్ హత్య ఘటన వెలుగులోకి రావడంతో నిందితుల కోసం పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు. ఇందులో భాగంగానే పోలీసులు 100 గంటల సీసీటీవీ ఫుటేజీని స్కాన్ చేశారు. అనుమానితుడిగా భావిస్తున్న వారిలో ఒకరు ఫోన్‌లో మాట్లాడుతున్నట్లు గుర్తించారు. సెల్ టవర్‌లోని యాక్టివ్ మొబైల్ నంబర్‌లను తీసుకున్నారు. 5,000 నంబర్‌లను జల్లెడ పట్టి నిందితులను గుర్తించారు.

Earthquake: ఉలిక్కిపడ్డ అండమాన్ నికోబార్.. అర్థరాత్రి భూకంపం.. భయాందోళనతో జనం పరుగులు..

సోదరులిద్దరిని రాజస్థాన్‌కు చెందిన కాకా, హ్యాపీగా గుర్తించినట్లు డీసీపీ (సెంట్రల్) సంజయ్ సైన్ తెలిపారు. వీరి స్నేహితుడిని పంజాబ్‌కు చెందిన అనిల్‌గా గుర్తించారు. నిందితులకు పలు క్రిమినల్ కేసుల్లో ప్రమేయం ఉంది. హ్యాపీ, అనిల్ పంజాబ్‌లోని సంగ్రూర్ జైలులో ఉన్నప్పుడు కలుసుకున్నారని డిసిపి తెలిపారు. 30 ఏళ్ల సెక్స్ వర్కర్ ను మధ్యాహ్నం 2 గంటలకు కాల్చి చంపారు. పోలీసులకు మధ్యాహ్నం 2.15 గంటలకు కాల్ వచ్చింది. 30 ఏళ్ల మహిళను, 28 యేళ్ల ఆమె పింప్ ఇమ్రాన్ ను, అప్పటికే ఆసుపత్రికి తీసుకువెళ్లారు. మహిళ మెడ వెనుక భాగంలో బుల్లెట్ గాయం కాగా, ఇమ్రాన్ భుజంపై గాయమైంది. ఆ తర్వాత మహిళ చికిత్స పొందుతూ మృతి చెందింది.

వెంటనే దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు నిందితులు పారిపోకుండా పట్టుకునే క్రమంలో రైల్వే స్టేషన్లు, బస్ టెర్మినల్స్ వద్ద ఉన్న పెద్ద సంఖ్యలో కెమెరాలను స్కాన్ చేసినట్లు పోలీసులు తెలిపారు. నేరం చేసిన తర్వాత వారు న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌కు వెళ్లినట్లు గుర్తించారు. యాక్టివ్ నంబర్‌ల జాబితా కోసం పోలీసులు సంఘటన సమయంలో జీబీ రోడ్‌లో, స్టేషన్ సమీపంలోని టవర్‌లో యాక్టివ్‌గా ఉన్న అన్ని ఫోన్ నంబర్‌లను స్కాన్ చేశారు. ఎట్టకేలకు అనుమానితులను గుర్తించి పశ్చిమ యూపీ, పంజాబ్‌లోని వేర్వేరు ప్రాంతాల్లో దాడులు నిర్వహించి ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు.

కాకా తూర్పు ఢిల్లీలోని ఓ ప్రముఖ స్వీట్ షాప్‌లో పనిచేసేవాడని, హోలీ సందర్భంగా భారీగా నగదు వసూళ్లు జరుగుతాయని తనకు తెలుసునని నిందితులు విచారణలో వెల్లడించారు. అనంతరం దోపిడీకి ప్లాన్ చేశారు. సోదరులు బీహార్ నుండి పిస్టల్స్ కొనుగోలు చేసి మార్చి 7 న న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌కు చేరుకున్నారు. అనిల్ కూడా పంజాబ్ నుండి అక్కడికి చేరుకున్నారని, ఆ తర్వాత వారు జిబి రోడ్‌కు వెళ్లారని పోలీసులు తెలిపారు.

PREV
click me!

Recommended Stories

Viral News: ఈ గ్రామంలో మ‌హిళ‌లు 5 రోజులు న‌గ్నంగా ఉంటారు.. వింత ఆచారం ఎక్క‌డంటే
Census 2027: 30 లక్షల మంది సిబ్బంది, రూ. 11,718 కోట్లు.. ప్రపంచంలోనే అతిపెద్ద ఫీల్డ్ ఆపరేషన్‌గా జ‌న‌గ‌ణ‌న‌