చీర కట్టుకొని ఫుట్ బాల్ అదరగొట్టిన మహిళలు.. వీడియో వైరల్..!

Published : Apr 01, 2023, 09:45 AM ISTUpdated : Apr 01, 2023, 09:46 AM IST
చీర కట్టుకొని ఫుట్ బాల్ అదరగొట్టిన మహిళలు.. వీడియో వైరల్..!

సారాంశం

అలాంటిది వారు ఏకంగా  చీరలు కట్టుకొని.. కాళ్లకు స్నీకర్స్ ధరించి అదరగొట్టేశారు.

ఈ రోజుల్లో అమ్మాయిలు చీర కట్టుకొని సరిగా నడవడం కూడా రాక ఇబ్బందిపడుతున్నారు. అలాంటిది మహిళలంతా కలిసి చీరలు కట్టుకొని ఏకంగా ఫుట్ బాల్ ఆడేశారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. సాధారణంగా మహిళలు ఫుట్ బాల్ ఆడటమే చాలా తక్కువగా చూస్తుంటాం. అలాంటిది వారు ఏకంగా  చీరలు కట్టుకొని.. కాళ్లకు స్నీకర్స్ ధరించి అదరగొట్టేశారు. ఈ సంఘటన గ్వాలియర్ లో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

గ్వాలియర్ లో కొందరు మహిళలు ఫుట్ బాల్ ఆడారు. వీడియో చిన్నదే అయినప్పటికీ.. వారు ఆట ఆడిన తీరుకు అందరూ ఫిదా అయిపోతున్నారు. అదరగొట్టేశారంటూ నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఆ వీడియోలో కనిపించే మహిళలంతా 25 నుంచి 50ఏళ్ల వయసు వారు కావడం విశేషం. ఈ వీడియో మార్చి 25వ తేదీన తీసినట్లు తెలుస్తోంది.
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కలకలం... ఇంటర్నేషనల్ విమానాలకు బాంబు బెదిరింపులు
ఇండిగో విమానాలను దెబ్బకొట్టింది ఏంటి? అసలు ఈ ఎఫ్‌డిటిఎల్ అంటే ఏమిటి?