ఇండియా కూటమి అలైన్‌మెంట్ దెబ్బతింది: లోక్‌సభలో కాంగ్రెస్ పై మోడీ సెటైర్లు

By narsimha lode  |  First Published Feb 5, 2024, 6:50 PM IST

రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే చర్చకు  ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ లోక్ సభలో ఇవాళ సమాధానమిచ్చారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పై ఆయన  తీవ్రంగా మండిపడ్డారు.


 న్యూఢిల్లీ: ఇండియా ఆలయన్స్ అలైన్ మెంట్ దెబ్బతిందని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఎద్దేవా చేశారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే చర్చకు  సోమవారం నాడు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ  లోక్‌సభలో  సమాధానమిచ్చారు. ఇండియా కూటమిలో ఒకరిపై ఒకరికి విశ్వాసం లేదన్నారు. ఇండియా కూటమిలోని పార్టీలను దేశ ప్రజలు ఎలా నమ్ముతారని మోడీ ప్రశ్నించారు.

 దేశ ప్రజలను కాంగ్రెస్ తక్కువ అంచనా వేస్తుందన్నారు.   భారతీయుల్లో ఆత్మన్యూనత ఎక్కువని ఎర్రకోట సాక్షిగా  ఇందిరాగాంధీ అన్నారు. దేశ సామర్ధ్యం మీద కాంగ్రెస్ కు నమ్మకం లేదన్నారు.   కూటమి కుదుపులకు లోనైందని  మోడీ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.భారతీయులు నెమ్మదిగా, సోమరుల్లా పనిచేస్తారని  నెహ్రు అన్నారు. ఇందిరాగాంధీ కూడా నెహ్రు కంటే ఏమీ తక్కువ కాదన్నారు.

Latest Videos

నెహ్రు, ఇందిరాగాంధీకి భారతీయుల శక్తిపై అంత నమ్మకం ఉండేది కాదన్నారు. మూడో దఫాల తాము వికసిత్ భారత్ లక్ష్యాల కోసం పనిచేస్తామన్నారు. దేశ శక్తి, సామర్థ్యాల పట్ల కాంగ్రెస్ కు ఎప్పుడూ నమ్మకం లేదన్నారు. ప్రధానిగా నెహ్రు తొలి ప్రసంగంలోనే విదేశీయులతో పోలిస్తే భారతీయులకు నైపుణ్యం లేదన్నారు.

తమకు ఓట్లు కాదు, ప్రజలు హృదయాలను గెలుచుకోవడమే ముఖ్యమని చెప్పారు మోడీ. ప్రభుత్వంలో ఓబీసీ నేతలు లేరని కాంగ్రెస్ చేస్తున్న విమర్శలపై ఆయన స్పందించారు. తన అంత పెద్ద ఓబీసీ నేత కాంగ్రెస్ కు కన్పించడం లేదా అని ఆయన  ప్రశ్నించారు.కర్పూరీ ఠాకూర్ ను కాంగ్రెస్ అవమానించిందని మోడీ విమర్శించారు.తమ ప్రభుత్వం కర్పూరీ ఠాకూర్ కు భారత రత్న ఇచ్చినట్టుగా  మోడీ గుర్తు చేశారు.

also read:ఎవరేమనుకున్నా మూడోసారి అధికారం మాదే: లోక్‌సభలో మోడీ

రైతులకు రూ. 18 లక్షల కోట్ల రుణాలిచ్చినట్టుగా మోడీ చెప్పారు. కిసాన్ స్మాన్ నిధితో రైతులకు సహకారం అందిస్తున్నామన్నారు.పంటలకు కనీస మద్దతు ధర పెంచినట్టు చెప్పారు. టెలికమ్యూనికేషన్ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చినట్టుగా  తెలిపారు.  తక్కువ ధరకే మొబైల్స్, డేటా దొరుకుతుందన్నారు.మేక్ ఇన్ ఇండియాతోనే ఇది సాధ్యమైందని మోడీ అభిప్రాయపడ్డారు.ఏవియేషన్ రంగంలో యువతకు కొత్త అవకాశాలు దొరుకుతున్నాయన్నారు. పంటలకు కనీస మద్దతు ధర పెంచినట్టుగా తెలిపారు.ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ లో  18 కోట్ల మంది కొత్తగా చేరినట్టుగా మోడీ గుర్తు చేశారు.

click me!