Aditya L1 Launch: సూర్యుడి గుట్టు విప్పేందుకు.. నింగిలోకి దూసుకెళ్లిన ఆదిత్య ఎల్-1 (వీడియో)

Published : Sep 02, 2023, 11:56 AM ISTUpdated : Sep 02, 2023, 12:50 PM IST
Aditya L1 Launch: సూర్యుడి గుట్టు విప్పేందుకు.. నింగిలోకి దూసుకెళ్లిన ఆదిత్య ఎల్-1 (వీడియో)

సారాంశం

భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మరో ప్రతిష్టాత్మక ప్రయోగాన్ని చేపట్టింది.

భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మరో ప్రతిష్టాత్మక ప్రయోగాన్ని చేపట్టింది. సూర్యుడి రహస్యాలను కనుగొనేందుకు పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఆదిత్య ఎల్‌-1 ఉపగ్రహం నింగిలోకి దూసుకెళ్లింది. ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లాలోని శ్రీహరికోటలోని సతీశ్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌ నుంచి శనివారం ఉదయం 11.50 గంటలకు పీఎస్ఎల్వీ సి57 వాహక నౌక నిప్పులు చిమ్ముతూ ఆదిత్య ఎల్‌-1 ఉపగ్రహాన్ని నింగిలోకి తీసుకెళ్లింది. ఈ ప్రయోగాన్ని వీక్షించేందుకు పెద్ద ఎత్తున వీక్షకులు శ్రీహరికోటకు చేరుకున్నారు. ఇక, ఇప్పటివరకు శాస్త్రవేత్తల అంచనాల ప్రకారమే ఆదిత్య ఎల్-1 ఉపగ్రహం నింగిలోకి దూసుకెళ్తుంది. ఆదిత్య ఎల్  1 గమనాన్ని షార్ నుంచి ఇస్రో శాస్త్రవేత్తలు పరిశీలిస్తున్నారు. 

ఇటీవల ఇస్రో చేపట్టిన చంద్రయాన్-3 ప్రయోగం విజయవంతం అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా ఇస్రో ప్రయోగించిన ఆదిత్య ఎల్-1 ప్రయోగం సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఆదిత్య ఎల్-1 ద్వారా ఏడు పేలోడ్‌లను పంపుతున్నారు. 

 

ఆదిత్య ఎల్-1 ప్రయోగం గురించి..
-సూర్యుడి పుట్టుక, అక్కడి వాతావరణంపై అధ్యయనం చేసేందుకు ఇస్రో ప్రయోగిస్తున్న మొదటి ఉపగ్రహం ఇదే.
-ఆదిత్య ఎల్ 1 ఉపగ్రహాన్ని భూమి నుంచి 15 లక్షల కిలోమీటర్ల దూరంలోని భూమి నుంచి సూర్యుడి దిశలో లాగ్రేంజ్‌ పాయింట్‌-1 (ఎల్‌-1) వద్ద ఉండే సుదీర్ఘమైన దీర్ఘ వృత్తాకార కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నారు. 
-అక్కడి చేరేందుకు ఆదిత్య ఎల్-1 ఉపగ్రహానికి దాదాపు 125 రోజుల సమయం పడుతుంది. 

 


-ఈ ప్రదేశం నుంచి ఎలాంటి  అవరోధం లేకుండా సూర్యుడిని నిరంతరం అధ్యయనం చేసే  వీలు ఉంటుంది. 
-ఈ ఉపగ్రహం ద్వారా సౌర వ్యవస్థపై పరిశోధనలు జరపడంతో పాటు.. సౌర తుఫానులు, సూర్యుడి పుట్టుక, అక్కడి వాతావరణం, పరిస్థితులపై అధ్యయనం చేయాలనిఇస్రో చూస్తుంది. 
-ఇందు కోసం ఏడు పేలోడ్స్‌ను తీసుకెళ్తుండగా.. ఇవి సూర్యుడి పొరలైన ఫోటోస్పియర్‌, క్రోమోస్పియర్‌, సూర్యుడి బయటి పొర (కరోనా), సౌర రేణువులు, అయస్కాంత క్షేత్రాలను అధ్యయనం చేయనున్నాయి. తద్వారా సౌర తుఫానులు, అక్కడి వాతావరణం, పరిస్థితులపై అధ్యయనం చేయవచ్చు.

PREV
click me!

Recommended Stories

నేపాల్లో వరదల మధ్య గర్భిణిని కాపాడి హెలీకాఫ్టర్లో తరలించిన రెస్క్యూ టీమ్ Nepal Rescue Pregnant Woman
ముంబై ఇస్కాన్‌లో జన్మాష్టమి వేడుకలు మంగళ హారతి దర్శనం | Mumbai ISKCON Janmashtami 2026 Celebrations