ఏషియానెట్ న్యూస్ కార్యాలయంపై దాడి.. నిందితుడి అరెస్ట్‌.. 

Published : Aug 14, 2023, 12:54 PM IST
ఏషియానెట్ న్యూస్ కార్యాలయంపై దాడి.. నిందితుడి అరెస్ట్‌.. 

సారాంశం

కేరళలోని తిరువనంతపురంలోని ఏషియానెట్ న్యూస్ కార్పొరేట్ కార్యాలయంపై సోమవారం (ఆగస్టు 14) తెల్లవారుజామున 5 గంటలకు ఓ దుండగుడు దాడికి పాల్పడ్డాడు. నిందితుడు సూరజ్‌ను స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. 

కేరళలోని తిరువనంతపురంలోని ఏషియానెట్ న్యూస్ కార్పొరేట్ కార్యాలయంపై దాడి జరిగింది. సోమవారం (ఆగస్టు 14) తెల్లవారుజామున 5 గంటలకు ఓ దుండగుడు దాడికి పాల్పడ్డాడు. కార్యాలయం అద్దాలు, ఉద్యోగి వాహనం అద్దాలు పగులగొట్టారు. హింసకు పాల్పడిన రాజాజీ నగర్‌కు చెందిన సూరజ్‌ను స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. గతంలో కూడా తిరువనంతపురంలోని ఏషియానెట్ న్యూస్ కార్పొరేట్ కార్యాలయంపై కూడా ఇదే తరహా దాడి జరిగింది. కార్యాలయానికి పోలీసు రక్షణ కల్పించాలని హైకోర్టు ఆదేశించినా హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటునే ఉన్నాయి. 

తెల్లవారుజామున 4:30 నుంచి 5:00 గంటల ప్రాంతంలో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. కార్యాలయం సమీపంలోని రాజాజీ నగర్ కు చెందిన సూరజ్ దాడికి పాల్పడ్డాడు. ముందుగా సెక్యూరిటీ క్యాబిన్ అద్దాన్ని ధ్వంసం చేశాడు. సెక్యూరిటీ గార్డు తప్పించుకోవడంతో ఎలాంటి గాయాలు కాలేదు. అనంతరం  నిందితుడు కార్యాలయం వెలుపల పార్క్ చేసిన ఉద్యోగి కారు అద్దాన్ని పగులగొట్టారు. 

విషయం తెలుసుకున్న రాజాజీ నగర్ స్థానికులు సూరజ్‌ను పట్టుకున్నారు. అనంతరం స్థానికులు పోలీసులకు అప్పగించారు. కార్యాలయంలోకి చొరబడిన సూరజ్‌పై కన్రోన్‌మేనార్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ  కార్యాలయంపై దాడి చేయడం ఇది మూడోసారి. గతంలో ఏషియానెట్ కార్యాలయంపై జరిగిన హింసాత్మక ఘటనల నేపథ్యంలో.. కార్యాలయానికి పోలీసు రక్షణ కల్పించాలని హైకోర్టు ఆదేశించింది. ఆర్డర్ అమల్లో ఉండగానే నేడు ఈ దారుణం జరిగింది.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Viral News: ఈ గ్రామంలో మ‌హిళ‌లు 5 రోజులు న‌గ్నంగా ఉంటారు.. వింత ఆచారం ఎక్క‌డంటే
Census 2027: 30 లక్షల మంది సిబ్బంది, రూ. 11,718 కోట్లు.. ప్రపంచంలోనే అతిపెద్ద ఫీల్డ్ ఆపరేషన్‌గా జ‌న‌గ‌ణ‌న‌