
మ్యూజిక్ ఐకాన్ జావేద్ అక్తర్ ముంబై 26/11 దాడులను ప్రస్తావిస్తూ పాకిస్థాన్ లో చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ప్రముఖ ఉర్దూ కవి ఫైజ్ అహ్మద్ ఫైజ్ జ్ఞాపకార్థం లాహోర్ లో జరిగిన ఓ ఉత్సవంలో పాల్గొనేందుకు ఆయన గత వారం పాకిస్థాన్ వెళ్లిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ విషయంలో అక్తర్ ‘ఎన్డీటీవీ’కి ఇంటర్వ్యూ ఇచ్చారు. తన స్పందనకు సరిహద్దు వెంబడి కూడా ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించిందని అన్నారు.
ప్రధాని మోడీ ప్రారంభించనున్న శివమొగ్గ విమానాశ్రయానికి వ్యతిరేకంగా రైతుల ఆందోళనలు
‘‘కార్యక్రమానికి హాజరైన వారంతా చప్పట్లు కొట్టారు. వారు నాతో ఏకీభవించారు. భారతదేశాన్ని ఆరాధించే, మాతో సంబంధం కలిగి ఉండాలని కోరుకునే ప్రజలు చాలా మంది ఉన్నారు.’’ అని అన్నారు. చర్చలు జరిపేందుకు ఇదే సరైన సమయమా అని అక్తర్ ను ప్రశ్నించగా.. ‘నాకు ఆ స్థాయి లేదు’ అని ఆయన సమాధానమిచ్చారు. అధికారంలో ఉన్నవారికి, ఆ పదవిలో ఉన్నవారికి ఏం జరుగుతోందో, ఎలా వెళ్లాలో అర్థమవుతుందని తెలిపారు. పాక్ సైన్యం, పాక్ ప్రజలు, పాక్ యంత్రాంగం ఒకే తాటిపై లేవని చెప్పారు.
చర్చలకు మధ్యవర్తిత్వం అవసరమని మీరు నమ్ముతున్నారా అని ‘ఎన్డీటీవీ’ ప్రశ్నించినప్పుడు ‘‘దేశాన్ని నడిపే వ్యక్తులకు అది బాగా తెలుసు. నాకున్న సమాచారం చాలా తక్కువ. భారత్ లో పాక్ ప్రజల గురించి చాలా తక్కువ సమాచారం ఉంది. వారిదీ అదే పరిస్థితి’’ అని తెలిపారు.
మనీష్ సిసోడియాకు భారీ షాక్.. స్నూపింగ్ కేసు విచారణకు కేంద్రం అనుమతి.. అసలు కథేమిటంటే..?
పాకిస్థాన్ లో ఆయన ప్రసంగిస్తున్న సమయంలో ఓ ప్రేక్షకుడు అడిగిన ప్రశ్నకు అక్తర్ ఇచ్చిన సమాధానం వైరల్ గా మారింది. ఆ ప్రేక్షకుడు మాట్లాడుతూ.. ‘‘మీరు చాలాసార్లు పాకిస్తాన్ సందర్శించారు. మీరు తిరిగి ఇండియాకు వెళ్లినప్పుడు పాకిస్థాన్ ప్రజలు మంచి వ్యక్తులు అని మీ ప్రజలకు చెప్పారు ? వారు బాంబులు వేయడమే కాదు, పూలదండలు వేసి, ప్రేమతో పలకరిస్తారని చెప్పారా’’ అని ప్రశ్నించారు. దీనికి అక్తర్ సమాధానమిస్తూ.. ‘‘ఇక్కడ ఎవరూ ఒకరినొకరు నిందించుకోవాల్సిన అవసరం లేదు. దీని వల్ల ఏదీ పరిష్కారం కాదు’’ అని అన్నారు.
‘‘వాతావరణం ఉద్రిక్తంగా ఉంది. దానిని ముందుగా చల్లబర్చాలి. మేము ముంబైకి చెందిన వాళ్లం. మేము మా నగరంపై దాడిని చూశాం. వారు (దాడి చేసినవారు) నార్వే లేదా ఈజిప్ట్ నుండి రాలేదు. వారు ఇప్పటికీ మీ దేశంలో స్వేచ్ఛగా తిరుగుతున్నారు. కాబట్టి హిందుస్తానీల కోపానికి అర్థం ఉంది. ఈ విషయంలో మీరు ఫిర్యాదు చేయడానికి అవకాశం లేదు’’ అని ఆయన తేల్చి చెప్పారు.
ఇంటివరండాలో నిద్రిస్తున్న 65 యేళ్ల మహిళ హత్య.. యూపీలో దారుణం..
అంతే కాదు పాకిస్థాన్ కు వచ్చిన కళాకారులకు సరైన ఆతిథ్యం ఇవ్వడం లేదని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. కానీ భారత్ అలా చేయదని అన్నారు. పాకిస్థాన్ నుంచి వచ్చిన కళాకారులను ఎంతో గౌరవించామని అన్నారు. ఆయన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో సర్వత్రా హర్షం వ్యక్తం అయ్యాయి. ఆయన వ్యాఖ్యలను పలువురు నెటిజన్లు సర్జికల్ స్ట్రైక్ అని అభివర్ణించారు. జై హింద్ జావేద్ సాబ్.. మీరు ఇంట్లోకి వెళ్లి మరీ వారిపై దాడి చేశారంటూ బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ట్వీట్ చేశారు.