సోమ, మంగళవారాల్లో ఎంపీల ప్రమాణం: ఏపీ నుంచి ముందుగా ఆమె

By Siva KodatiFirst Published 17, Jun 2019, 8:11 AM IST
Highlights

17వ లోక్‌సభ సమావేశాలు సోమవారం నుంచి మొదలుకానున్నాయి. ప్రొటెం స్పీకర్‌గా బీజేపీ ఎంపీ వీరేంద్ర కుమార్ సోమవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాష్ట్రపతి భవన్‌లో జరిగే ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు.

అనంతరం ఉదయం 11 గంటలకు పార్లమెంట్ సమావేశాలు ప్రారంభంకానున్నాయి. కొత్తగా లోక్‌సభకు ఎన్నికైన వారి చేత ప్రొటెం స్పీకర్ ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ఈ ప్రక్రియ సోమ, మంగళవారాల్లో కొనసాగనుంది.

ముందుగా ప్రధాని మోడీ, కేబినెట్ మంత్రులు, ప్యానల్ ఛైర్మన్లు,  ఎంపీలుగా ప్రమాణ స్వీకారం చేస్తారు. అనంతరం ఆంగ్ల అక్షర క్రమంలో రాష్ట్రాల వారీగా ఎంపీలు ప్రమాణ స్వీకారం చేస్తారు.

తొలుత అండమాన్ నికోబార్ ఎంపీ... ఆ తర్వాత రెండో స్థానంలో ఎపీ ఎంపీలు ప్రమాణం చేస్తారు. ఈ క్రమంలో అరకు ఎంపీ గొడ్డేటి మాధవి ఎంపీగా ప్రమాణ స్వీకారం చేస్తారు. 

Last Updated 17, Jun 2019, 8:11 AM IST