బాబు, కేసీఆర్‌లకు కేంద్రం లేఖ: అఖిలపక్ష సమావేశానికి రావాలని ఆహ్వానం

Siva Kodati |  
Published : Jun 16, 2019, 02:01 PM ISTUpdated : Jun 16, 2019, 02:14 PM IST
బాబు, కేసీఆర్‌లకు కేంద్రం లేఖ: అఖిలపక్ష సమావేశానికి రావాలని ఆహ్వానం

సారాంశం

పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషితో ప్రధాని నరేంద్రమోడీ సమావేశమయ్యారు. త్వరలో జరగనున్న పార్లమెంటరీ వ్యవహారాలు, స్పీకర్ ఎన్నిక తదితర అంశాలపై వీరిద్దరు చర్చించారు.

సోమవారం నుంచి పార్లమెంట్ సమాశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆదివారం ప్రధాని మోడీ నేతృత్వంలో అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. పార్లమెంట్ సమావేశాలు సజావుగా జరిగేలా చూడాలని అన్ని పార్టీలను ప్రధాని కోరారు.

ఈ సమావేశంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి పలు పార్టీల ఫ్లోర్ లీడర్లు పాల్గోన్నారు. 

మరోవైపు ప్రహ్లాద్ జోషి పార్లమెంటులో ప్రాతినిథ్యం వహిస్తున్న పార్టీల అధ్యక్షులతో ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు. ఐదు లక్ష్యాల సాధన కోసం అన్ని పార్టీల అధ్యక్షులతో ఆయన భేటీకానున్నారు.

అజెండాలో తొలి అంశంగా పార్లమెంట్ ఔన్నత్యాన్ని పెంపోందించేందుకు చర్యలు, రెండో అంశంగా ఒకే దేశం-ఒకే ఎన్నికలు, మూడో అంశంగా 75 ఏళ్ల స్వాతంత్ర్యం సందర్భంగా నవభారత నిర్మాణం, 4వ అంశంగా మహాత్మా గాంధీ 150వ జయంతి వేడుకల నిర్వహణ, 5వ అంశంగా వెనుకబడిన జిల్లాల అభివృద్ధి ఉంటాయి.

ఈ ఐదు అంశాలపై చర్చించేందుకు హాజరుకావాలని ఆయా పార్టీల అధినేతలకు మంత్రి జోషి లేఖలు రాశారు. టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు టీఆర్ఎస్ చీఫ్, తెలంగాణ సీఎం కేసీఆర్‌కు ఈ భేటీలో పాల్గొనాల్సిందిగా కేంద్రం లేఖలు రాసింది. 
 

PREV
click me!

Recommended Stories

MICE పథకం.. ఈ రంగంలో గేమ్‌ చేంజర్
రైళ్లలో ఇకపై లగేజీకి ఛార్జీలు:Ashwini Vaishnaw on Indian Railway Luggage Rules | Asianet News Telugu