కరోనా ఎఫెక్ట్: ఢిల్లీలో అక్టోబర్ 31వ తేదీ వరకు స్కూల్స్ మూత

By narsimha lodeFirst Published Oct 4, 2020, 3:40 PM IST
Highlights

 కరోనా నేపథ్యంలో ఈ నెలాఖరు వరకు స్కూళ్లను మూసివేస్తున్నట్టుగా డిప్యూటీ మనీష్ సిసోడియా స్పష్టం చేశారు.
 


అమరావతి: కరోనా నేపథ్యంలో ఈ నెలాఖరు వరకు స్కూళ్లను మూసివేస్తున్నట్టుగా డిప్యూటీ మనీష్ సిసోడియా స్పష్టం చేశారు.

ఈ నెల 5వ తేదీ నుండి స్కూల్స్ తెరుస్తామని గతంలో ఢిల్లీ ప్రభుత్వం ప్రకటించింది. అయితే కరోనా నేపథ్యంలో స్కూళ్లను తెరవకూడదని ఇవాళ నిర్ణయం తీసుకొంది.

ఆన్ లైన్ క్లాసులను యథాతథంగా జరుగుతాయని ప్రభుత్వం ప్రకటించింది. కరోనా నేపథ్యంలో పిల్లల ఆరోగ్యంతో రిస్క్ చేయడం సరైందికాదని ఈ నిర్ణయం తీసుకొందని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తెలిపారని మంత్రి సిసోడియా తెలిపారు.

విద్యాసంస్థలను ప్రారంభించే విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలదే తుది నిర్ణయమని కేంద్ర ప్రభుత్వం ఆన్ లాక్ 5.0 లో ప్రకటించిన విషయం తెలిసిందే.
తల్లిదండ్రుల అనుమతితోనే విద్యార్థులను స్కూళ్లకు పంపాలని కేంద్రం తెలిపింది. 

దీంతో రాష్ట్ర ప్రభుత్వాలు స్కూల్స్ ప్రారంభించే విషయంలో  ఇంకా నిర్ణయం తీసుకొనే విషయమై విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యావేత్తలతో సంప్రదింపులు జరుపుతున్నారు.ఈ ఏడాది నుండి మార్చి నుండి విద్యాసంస్థలను మూసివేశారు.
 

click me!