
బెంగుళూరు: కర్ణాటక రాష్ట్ర సంస్కృతి, పర్యాటక శాఖ మంత్రి సీటీ రవి మంత్రి పదవికి రాజీనామా చేశారు. జాతీయ ప్రధాన కార్యదర్శి పదవి లభించిన తర్వాత ఆయన మంత్రి పదవికి రాజీనామా చేశారు.
కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్పకు సీటీరవి రాజీనామా పత్రాన్ని సమర్పించినట్టుగా సమాచారం.పార్టీలో పదవి లభించిన తర్వాత మంత్రి పదవికి రాజీనామా చేస్తానని సీటీ రవి ప్రకటించిన విషయం తెలిసిందే.
సీటీ రవి మంత్రి పదవికి రాజీనామా ఇంకా ఆమోదించాల్సి ఉంది. సోమవారం నాడు ఆయన పార్టీ నేతలను కలుసుకొనేందుకుగాను ఆయన ఢిల్లీకి వెళ్లనున్నారు.సీటీ రవి రాజీనామా తర్వాత సీఎం యడియూరప్ప తన మంత్రివర్గాన్ని పునర్వవ్యవస్థీకరించే అవకాశం ఉందని సమాచారం.
కేబినెట్ లో 34 మందికి మించకూడదు. ప్రస్తుతం యడియూరప్ప మంత్రివర్గంలో 28 మందికి మంత్రులున్నారు. జేడీ(ఎస్), కాంగ్రెస్ నుండి బీజేపీకి మద్దతు ప్రకటించిన ఎమ్మెల్యేలు మంత్రి పదవులను ఆశిస్తున్నారు.ఈ ఏడాది సెప్టెంబర్ 26వ తేదీన సీటీ రవికి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పదవి దక్కింది.