రిమోట్ ఓటింగ్ మిషన్‌పై ఈసీ అఖిలపక్ష సమావేశం.. కుదరని ఏకాభిప్రాయం, 25న మరోసారి భేటీ

Siva Kodati |  
Published : Jan 15, 2023, 09:09 PM IST
రిమోట్ ఓటింగ్ మిషన్‌పై ఈసీ అఖిలపక్ష సమావేశం.. కుదరని ఏకాభిప్రాయం, 25న మరోసారి భేటీ

సారాంశం

రిమోట్ ఓటింగ్ మిషన్‌పై రాజకీయ పార్టీలతో ఎన్నికల కమీషన్ నిర్వహించిన అఖిలపక్ష సమావేశం ముగిసింది. అయితే ఈ ప్రతిపాదనను పలు పార్టీలు తీవ్రంగా వ్యతిరేకించినట్లుగా తెలుస్తోంది.  

రిమోట్ ఓటింగ్ మిషన్‌పై రాజకీయ పార్టీలతో ఎన్నికల కమీషన్ నిర్వహించిన అఖిలపక్ష సమావేశం ముగిసింది. ఈ భేటీకి కాంగ్రెస్, శివసేన, ఆర్జేడీ, సీపీఎం, జేడీయూ, జేఎంఎం, నేషనల్ కాంగ్రెస్, వీసీకే , పీడీపీ తదితర పార్టీలకు చెందిన నేతలు హాజరయ్యారు. అయితే ఈ ప్రతిపాదనను పలు పార్టీలు తీవ్రంగా వ్యతిరేకించినట్లుగా తెలుస్తోంది. ఈ నెల 25న మరోసారి సమావేశం జరిగే అవకాశం వుంది. 

ఇదిలావుండగా.. చేస్తున్న ఉద్యోగాలకు లీవులు పెట్టి.. ప్రయాణ ఖర్చులు భరించి సొంత ఊర్లకు వెళ్లి ఓటు హక్కును వినియోగించుకోలేక పోతున్న వారు ఎంతోమంది. దీని వల్ల మూడో వంతు ఓటర్లు పోలింగ్ కు దూరంగా ఉండాల్సి వస్తుంది. స్వస్థలాలను వదిలి బతుకు తెరువు కోసం వేరే ఊర్లలో ఉద్యోగాలు చేసేవారికి ఓటుహక్కును వినియోగించుకోవడం గగనంగా మారడంతో దేశంలో మూడోవంతు ఓటర్లు పోలింగ్ కు దూరంగా ఉండాల్సి వస్తోంది. 

ALso REad: రిమోట్ ఓటింగ్ : ఉన్న చోటునుంచే ఓటు వేయచ్చు.. సొంతూళ్లకు వెళ్లలేనివారి కోసం.. ఒక్క మిషన్, 72 నియోజకవర్గాలు...

ఇది ఆందోళన కలిగించే విషయమే. ఈ సమస్యను పరిష్కరించే దిశగా కేంద్ర ఎన్నికల సంఘం ప్రయత్నాలు చేసింది. దీంట్లో భాగంగా కొత్త ప్రయత్నానికి శ్రీకారం చుడుతోంది. సొంతూర్లను వదిలి వివిధ కారణాల వల్ల వలసలు వెళ్ళిన వారు తాము ఉన్నచోటు నుంచే.. తమ తమ నియోజకవర్గాల్లో ఓటువేసేలా ‘రిమోట్ వోటింగ్ మిషన్’ ను అందుబాటులోకి తీసుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. ఎన్నికల సంఘం ఈ రిమోట్ ఓటింగ్ కు సంబంధించి కాన్సెప్ట్ నోట్ ను సిద్ధం చేసింది. రిమోట్ ఎలక్ట్రానిక్ వోటింగ్ మిషన్ (ఆర్ విఎం) నమూనాను కూడా దీంతోపాటు రూపొందించింది. 

ఈ రిమోట్ ఎలక్ట్రానిక్ వోటింగ్ మిషన్ ద్వారా ఒక్క పోలింగ్ బూత్ నుంచే 72 నియోజకవర్గాల్లోని వారు తమ తమ ఓటు హక్కును వినియోగించుకోవచ్చు. ఈ మేరకు ఈ ఆర్ విఎంను డెవలప్ చేశారు. ఈ నమూనా మిషన్ ప్రదర్శన కోసం జనవరి 16న దేశంలోని అన్ని రాజకీయ పార్టీలను ఎన్నికల  కమిషన్ ఆహ్వానించింది. ఈ మేరకు గురువారం ఓ ప్రకటనలో వెల్లడించింది. రిమోట్ ఓటింగ్ను అమలులోకి తెచ్చే కంటే ముందు.. దాని అమలులో ఎదురయ్యే న్యాయపరమైన, సాంకేతిక సమస్యలను గుర్తించి పరిష్కరించాల్సిన అవసరం ఉందని ఎన్నికల కమిషన్ వివరించింది. దీనికోసమే రాజకీయ పార్టీల అభిప్రాయాలను తీసుకోనున్నట్లు తెలిసింది.
 

PREV
click me!

Recommended Stories

Weather Update : మళ్లీ భారీ వర్షాలు.. ఈ ప్రాంతాలకు ఐఎండీ అలర్ట్ !
కేవలం పదో తరగతి చదివుంటే చాలు.. రూ.57,000 జీతంతో కేంద్ర హోంశాఖలో ఉద్యోగాలు