దేశంలో ప్రధాని పోస్టు ఖాళీగా లేదు, 2024 ఎన్నికల్లో ఎన్డీయేనే గెలుస్తుంది: కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్

Published : Jan 15, 2023, 08:20 PM IST
దేశంలో ప్రధాని పోస్టు ఖాళీగా లేదు, 2024 ఎన్నికల్లో ఎన్డీయేనే గెలుస్తుంది: కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్

సారాంశం

దేశంలో ప్రధానమంత్రి పదవి ఖాళీగా లేదని కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు. వరుసగా రెండు సార్లు ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీలోనే ప్రజలు విశ్వాసం ఉంచారని వివరించారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లోనూ నరేంద్ర మోడీ సారథ్యంలో ఎన్డీయేకే అధికారాన్ని ప్రజలు కట్టబెడుతారని తెలిపారు.  

న్యూఢిల్లీ: దేశంలో ప్రధానమంత్రి ఖాళీగా లేదని కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లోనూ ప్రజలు ఎన్డీయేకే అధికారాన్ని కట్టబెడతారని ఆదివారం వివరించారు. ఈ సందర్భంగా ఆయన నోబెల్ గ్రహీత అమర్త్యసేనన్‌ అభిప్రాయంపై ప్రశ్నలు వేశారు. దేశ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టే సామర్థ్యం తృణమూల్ కాంగ్రెస్ చీఫ్ మమతా బెనర్జీకి ఉన్నదని అమర్త్యసేన్ న్యూస్ ఏజెన్సీ పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.

కోల్‌కతాలో విలేకరులతో మాట్లాడుతూ నరేంద్ర మోడీ పక్షానే ప్రజలు ఉన్నారని, మోడీ నాయకత్వానికే మద్దతు ఇస్తారని ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు. ‘దేశ ప్రధానమంత్రి పదవి ఖాళీగా లేదు. దేశ ప్రజలు వరుసగా రెండోసారి నరేంద్ర మోడీలోనే నమ్మకాన్ని ఉంచారు’ అని ఆయన చెప్పారు. బీజేపీ వ్యవస్థాగత సమావేశానికి ముందు కోల్‌కతాలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. 

దేశంలోని పేదలు, మహిళలు, యువత, వెనుకబడిన వర్గాలే దేశాన్ని నడిపే బాధ్యతను నరేంద్ర మోడీ చేతిలో పెట్టారని వివరించారు. ‘2024 జనరల్ ఎన్నికల్లో నరేంద్ర మోడీ సారథ్యంలో ఎన్డీయే గెలుస్తుందని చెప్పడానికి అనుమానమేమీ అక్కర్లేదు’ అని ఆయన స్పష్టం చేశారు.

ఆర్థిక శాస్త్రంలో నోబెల్ పురస్కారం పొందిన అమర్త్య సేన్ 2024 లోక్‌సభ ఎన్నికలపై స్పందించారు. అమర్త్యసేన్ అభిప్రాయాలకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. వచ్చే జనరల్ ఎలక్షన్ కేవలం ఒకే పార్టీ దూసుకుపోతున్నట్టు ఏమీ ఉండదని పరోక్షంగా బీజేపీని ఉద్దేశించి అన్నారు. అలాగే, ప్రాంతీయ పార్టీల ప్రాధాన్యతను నొక్కి చెప్పారు.

Also Read: మమత బెనర్జీకి ఉపశమనం.. ఆ కేసులో సమన్లు ​​కొట్టివేయిన ముంబై సెషన్స్ కోర్టు ..

వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీలకు స్పష్టమైన ప్రాధాన్యత ఉన్నదని అమర్త్యసేన్ అన్నారు. తదుపరి ప్రధానమంత్రిగా బాధ్యతలు తీసుకునే సామర్థ్యం మమతా బెనర్జీకి ఉన్నదా? అని అడగ్గా ఉన్నదని చెప్పారు. అయితే, బీజేపీ వ్యతిరేకతను ఏకం చేయడంలో ఆమె ఇంకా సఫలం కావాల్సి ఉన్నదని వివరించారు.

వచ్చే ఎన్నికల్లో ‘ప్రాంతీయ పార్టీలకు స్పష్టమైన ప్రాధాన్యత ఉన్నది. నాకైతే డీఎంకే చాలా ముఖ్యమైన పార్టీ అని అనిపిస్తున్నది. తృణమూల్ పార్టీకీ ప్రాధాన్యత ఉన్నది. సమాజ్‌వాదీ పార్టీ కూడా ఈ జాబితాలో ఉంటుంది. కానీ, ఎస్పీ ఇంకా ముందుకు వెళ్లుతుందా? లేదా? అనేది చెప్పలేం... దేశాన్ని మొత్తంగా కాకుండా హిందువుల డైరెక్షన్‌లో వెళ్లుతున్నట్టుగా ఎస్టాబ్లిస్ చేసుకుంటున్న బీజేపీని మరే పార్టీ ఎదుర్కోదనే దృక్పథం పొరపాటు అని భావిస్తున్నా’ అని ఆయన వివరించారు.

PREV
click me!

Recommended Stories

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కలకలం... ఇంటర్నేషనల్ విమానాలకు బాంబు బెదిరింపులు
ఇండిగో విమానాలను దెబ్బకొట్టింది ఏంటి? అసలు ఈ ఎఫ్‌డిటిఎల్ అంటే ఏమిటి?