దొంగతనం చేసి తప్పించుకునే యత్నం.. లిఫ్ట్‌కి ఫుట్‌ ఓవర్ బ్రిడ్జికి మధ్య ఇరుక్కుని, నుజ్జునుజ్జు

Siva Kodati |  
Published : Jan 15, 2023, 08:39 PM IST
దొంగతనం చేసి తప్పించుకునే యత్నం.. లిఫ్ట్‌కి ఫుట్‌ ఓవర్ బ్రిడ్జికి మధ్య ఇరుక్కుని, నుజ్జునుజ్జు

సారాంశం

ఢిల్లీలో విషాదం చోటు చేసుకుంది. లిఫ్ట్‌లో ఇరుక్కుని 25 ఏళ్ల వ్యక్తి ప్రాణాలు కోల్పోగా.. ముగ్గురు విద్యార్ధులను పోలీసులు రక్షించారు . నుజ్జునుజ్జయిన అతని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించామని, దీనిపై తదుపరి విచారణ జరుగుతోందన్నారు

ఢిల్లీలో విషాదం చోటు చేసుకుంది. లిఫ్ట్‌లో ఇరుక్కుని 25 ఏళ్ల వ్యక్తి ప్రాణాలు కోల్పోగా.. ముగ్గురు విద్యార్ధులను పోలీసులు రక్షించారు. మాలవీయ నగర్‌లో ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. శనివారం రాత్రి 8.30 గంటల ప్రాంతాలో ఈ దుర్ఘటన జరిగింది. ముగ్గురు విద్యార్ధులు లిఫ్ట్‌లో ఇరుక్కుపోవడంతో వారు పోలీసులకు ఎస్ఓఎస్ కాల్ చేశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక, పోలీసులు, ప్రజాపనుల శాఖ అధికారులు అక్కడికి చేరుకున్నారు. 

అయితే దొంగగా చెబుతున్న ఓ వ్యక్తి లిప్ట్‌కి , ఫుట్ ఓవర్ బ్రిడ్జికి మధ్య వున్న ఇరుసుల మధ్య ఇరుక్కుపోవడంతో లిఫ్ట్ చెడిపోయింది. మాలవీయ నగర్‌కు చెందిన ఆప్ ఎమ్మెల్యే సోమనాథ్ భారతి మాట్లాడుతూ.. ఆ వ్యక్తి దొంగ అని, లిఫ్ట్ నుంచి ఖరీదైన సామాగ్రిని దొంగిలించడానికి ప్రయత్నిస్తుండగా ఈ ఘటన జరిగిందన్నారు. నుజ్జునుజ్జయిన అతని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించామని, దీనిపై తదుపరి విచారణ జరుగుతోందన్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

PREV
click me!

Recommended Stories

New Year: 2026.. ఈ నెంబ‌ర్ చాలా స్పెష‌ల్‌, 20 ఏళ్లకు ఒక‌సారే ఇలా జ‌రుగుతుంది
టార్గెట్ 2035 .. ఈ రాష్ట్రంలో మురుగునీరే ఉండదట