వారు నలుగురూ గుజరాత్ వాసులే.. యూఎస్-కెనడా సరిహద్దులో చనిపోయిన భారత కుటుంబం..

Published : Apr 03, 2023, 11:35 AM IST
వారు నలుగురూ గుజరాత్ వాసులే.. యూఎస్-కెనడా సరిహద్దులో చనిపోయిన భారత కుటుంబం..

సారాంశం

ఆ నలుగురు కుటుంబ సభ్యులు గుజరాత్‌లోని మెహసానాలోని విజాపూర్ తాలూకాలోని మానెక్‌పురా-దభలా గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు.   

గుజరాత్ : కెనడా నుండి పడవలో అక్రమంగా యుఎస్‌లోకి ప్రవేశించేందుకు ప్రయత్నిస్తుండగా క్యూబెక్-న్యూయార్క్ సరిహద్దులోని నదిలో మునిగిపోయి ఎనిమిదిమంది అక్రమ వలసదారులు మృతి చెందారు. వీరిలో నలుగురితో కూడిన ఓ భారతీయ కుటుంబం ఉందన్న విషయం తెలిసిందే. ఈ నలుగురు భారతీయులు గుజరాత్ లోని మెహసానా జిల్లాలోని ఒక గ్రామానికి చెందిన వారుగా గుర్తించారు. మృతుల్లో ఇద్దరు దంపతులు, వారి పెద్ద పిల్లలు ఇద్దరు ఉన్నారు.

ఈ ప్రమాద ఘటనలో మొత్తం ఎనిమిది (8) మృతదేహాలను పోలీసులు ఇప్పుడు స్వాధీనం చేసుకున్నారు. అక్వేసాస్నే సమీపంలోని సెయింట్ లారెన్స్ నది ఒడ్డున కనుగొనబడిన మృతులు భారతీయ, రొమేనియన్ సంతతికి చెందిన రెండు కుటుంబాలు.. వారు యుఎస్‌కి కెనడా నుంచి అక్రమంగా వెళుతున్నట్లు భావిస్తున్నట్లు కెనడా పోలీసులు తెలిపారు.

యుఎస్-కెనడా సరిహద్దును అక్రమంగా దాటుతూ.. భారతీయులతో సహా 8 మంది వలసదారులు మృతి...

"ఇప్పుడు మొత్తం ఎనిమిది మృతదేహాలను వెలికితీశారు. మరణాలకు సంబంధించిన పరిస్థితులపై దర్యాప్తు కొనసాగుతోంది" అని అక్వేసాస్నే మోహాక్ పోలీసుల ప్రకటనలో తెలిపారు. మృతులు భారత్ లోని గుజరాత్ రాష్ట్రం, మెహసానాలోని విజాపూర్ తాలూకా మానెక్‌పురా-దభలా గ్రామానికి చెందిన చౌదరి కుటుంబానికి చెందినవారిగా గుర్తించారు. చనిపోయిన వారిలో తండ్రి, తల్లి, కుమారుడు,  కుమార్తెతో కూడిన కుటుంబం ఉంది.

మృతులు చౌదరి ప్రవీణ్‌భాయ్ వెల్జీభాయ్ (50), చౌదరి దక్షబెన్ ప్రవీణ్‌భాయ్ (45), చౌదరి విధిబెన్ ప్రవీణ్‌భాయ్ (23), చౌదరి మిత్‌కుమార్ ప్రవీణ్‌భాయ్ (20)లు. సోషల్ మీడియాలో వచ్చిన వార్తలను పరిశీలించిన తర్వాత చౌదరి కుటుంబానికి వారి మృతి గురించి తెలిసింది. ఏప్రిల్ 1న నలుగురు భారతీయుల మరణ వార్త సోషల్ మీడియా ద్వారా వారి కుటుంబానికి అందింది.

గత 15 రోజులుగా టొరంటోకు వెళ్లిన తర్వాత వారు ఎవరితోనూ టచ్ లో లేరని బంధువులు చెబుతున్నారు. శనివారం, నది నుండి స్వాధీనం చేసుకున్న రొమేనియన్ సంతతికి చెందిన ఇద్దరు వ్యక్తులను 28 ఏళ్ల ఫ్లోరిన్ ఇయోర్డాచే, 28 ఏళ్ల క్రిస్టినా (మోనాలిసా) జెనైడా ఇయోర్డాచేగా పోలీసులు గుర్తించారు. ఫ్లోరిన్ వద్ద రెండు కెనడియన్ పాస్‌పోర్ట్‌లు ఉన్నాయని పోలీసులు తెలిపారు. ఒకటి అతని రెండేళ్ల చిన్నారికి, మరొకటి అతని యేడాది వయసున్న చిన్నారిది. వీరి మృతదేహాలను కూడా స్వాధీనం చేసుకున్నారు.

"చనిపోయిన వారిలో ఒకరు, 28 ఏళ్ల ఫ్లోరిన్ ఇయోర్డాచే, అతని దగ్గర రెండు కెనడియన్ పాస్‌పోర్ట్‌లు ఉన్నాయి, ఒకటి రెండేళ్ల చిన్నారికి,  మరొకటి ఏడాది వయస్సు ఉన్న శిశువుది. ఇవి కూడా స్వాధీనం చేసుకున్నారు. మహిళను 28 ఏళ్ల క్రిస్టినా (మోనాలిసా) జెనైడా ఇయోర్డాచేగా గుర్తించారు" అని ప్రకటన జోడించారు.

PREV
click me!

Recommended Stories

Census 2027: 30 లక్షల మంది సిబ్బంది, రూ. 11,718 కోట్లు.. ప్రపంచంలోనే అతిపెద్ద ఫీల్డ్ ఆపరేషన్‌గా జ‌న‌గ‌ణ‌న‌
Prada: ఈ చెప్పుల ధ‌ర అక్ష‌రాల రూ. 85 వేలు.. కొల్హాపురి కళాకారులతో ఇటాలియ‌న్ కంపెనీ ఒప్పందం