బైక్ పై ఇద్దరు అమ్మాయిలతో డేంజర్ విన్యాసాలు.. యువకుడు అరెస్ట్..!

Published : Apr 03, 2023, 11:02 AM IST
బైక్ పై ఇద్దరు అమ్మాయిలతో డేంజర్ విన్యాసాలు.. యువకుడు అరెస్ట్..!

సారాంశం

వీడియో చూసినవారంతా ఆ స్టంట్స్ చూసి భయపడిపోయారు. వీడియో పోలీసుల కంట పడటంతో.... అతనిని పట్టుకోవడానికి పోలీసులు ఓ స్పెషల్ టీమ్ ని ఏర్పాటు చేశారు

చేతిలో బైక్ ఉంటే చాలు.. ప్రతి ఒక్కరూ హీరోలా ఫీలౌతూ ఉంటారు. ఆ బైక్ పై విన్యాసాలు చేస్తూ... ప్రమాదాలు కొని తెచ్చుకుంటున్నారు. తాజాగా ఓ యువకుడు ఇద్దరు అమ్మాయిలను బైక్ పై ఎక్కించుకొని భయంకరమైన స్టంట్స్ చేశాడు. దానిని వీడియో తీసుకొని సోషల్ మీడియాలో షేర్ చేయగా అది కాస్త  వైరల్ గా మారింది. దీంతో... ఆ వైరల్ వీడియో ని చూసి పోలీసులు సదరు యువకుడిని  అరెస్టు చేయడం గమనార్హం. నిందితుడిపై రెండు పోలీస్ స్టేషన్ లో కేసులు నమోదవ్వడం గమనార్హం. ఈ సంఘటన ముంబయిలో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.


ముంబయికి చెందిన  ఓ యువకుడు ఇటీవల ఇద్దరు అమ్మాయిలను బైక్ పై ఎక్కించుకొని భయానక విన్యాసాలు చేశాడు. ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఈ సంఘటన ముంబయి నగరంలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ (BKC) ప్రాంతంలో జరిగింది. వీడియో చూసినవారంతా ఆ స్టంట్స్ చూసి భయపడిపోయారు. వీడియో పోలీసుల కంట పడటంతో.... అతనిని పట్టుకోవడానికి పోలీసులు ఓ స్పెషల్ టీమ్ ని ఏర్పాటు చేశారు. ఆ  టీమ్ కాస్త  వెతికి వెతికి అతనిని ఇటీవల పట్టుకున్నారు. అతనికి వ్యతిరేకంగా కేసులు నమోదు చేశారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు చెప్పారు.


పోలీసుల ప్రకారం, అతను భారతీయ శిక్షాస్మృతి (IPC) 308 (అపరాధపూరితమైన నరహత్యకు ప్రయత్నించడం), మోటారు వాహనాల చట్టంలోని సెక్షన్లతో సహా సంబంధిత సెక్షన్ల కింద అరెస్టు చేశారు. విచారణ జరుగుతోందని పోలీసులు తెలిపారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Census 2027: 30 లక్షల మంది సిబ్బంది, రూ. 11,718 కోట్లు.. ప్రపంచంలోనే అతిపెద్ద ఫీల్డ్ ఆపరేషన్‌గా జ‌న‌గ‌ణ‌న‌
Prada: ఈ చెప్పుల ధ‌ర అక్ష‌రాల రూ. 85 వేలు.. కొల్హాపురి కళాకారులతో ఇటాలియ‌న్ కంపెనీ ఒప్పందం