దారుణం : భార్య రోజూ స్నానం చేయడం లేదని.. ఫోన్ లో త్రిపుల్ తలాక్.. విడాకులివ్వాలని కోర్టుకెక్కిన భర్త.. !

By AN TeluguFirst Published Sep 24, 2021, 4:33 PM IST
Highlights

క్వార్సీ గ్రామానికి చెందిన మహిళకు, చందౌస్ గ్రామానికి చెందిన వ్యక్తికి రెండేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఏడాది వయసున్న పాప ఉంది. ఈ క్రమంలో  భార్య రోజూ స్నానం చేయడం లేదని, స్నానం  చేయాలని  అడిగిన ప్రతిసారీ ఆమె తన తో గొడవ పడుతుందని...  ఆమె నుంచి విడాకులు కావాలని కోరాడు. 

లక్నో : భార్య నుంచి విడాకులు (Divorce)కోరుతూ ఓ వ్యక్తి కోర్టును ఆశ్రయించాడు. అయితే భర్త విడాకులు కావాలని అడగడం పక్కనపెడితే ఇందుకు అతను చెప్పిన కారణం మాత్రం వింతగా ఉంది.  భార్య ఈ రోజు స్నానం (Bathing) చేయడం లేదని చెబుతూ తనకు విడాకులు ఇప్పించాలని కోర్టులో పిటిషన్ వేశాడు.  ఈ ఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని  అలీఘర్ లో చోటుచేసుకుంది.  

క్వార్సీ గ్రామానికి చెందిన మహిళకు, చందౌస్ గ్రామానికి చెందిన వ్యక్తికి రెండేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఏడాది వయసున్న పాప ఉంది. ఈ క్రమంలో  భార్య రోజూ స్నానం చేయడం లేదని, స్నానం  చేయాలని  అడిగిన ప్రతిసారీ ఆమె తన తో గొడవ పడుతుందని...  ఆమె నుంచి విడాకులు కావాలని కోరాడు. 

అయితే, భర్తపై వ్యతిరేకంగా  భార్య  ఉమెన్ ప్రొటెక్షన్ సెల్లో ఫిర్యాదు చేయడంతో  ఈ విషయం వెలుగులోకి వచ్చింది. తనకు విడాకులు తీసుకోవడం ఇష్టం లేదని వివాహబంధాన్ని కొనసాగించాలనుకుంటున్నట్లు  వివాహిత వెల్లడించింది.  ప్రస్తుతం ఈ జంటకు అలీగడ్ ఉమెన్ ప్రొటెక్షన్ సెల్  కౌన్సిలింగ్  అందిస్తోంది.

ప్రతి రోజూ స్నానం చేయడం లేదనే సాకుతో భర్త తనకు త్రిపుల్ తలాక్  ఇచ్చాడని ఒక మహిళ  తమకు  రాతపూర్వక ఫిర్యాదు ఇచ్చిందని ఉమెన్ ప్రొటెక్షన్ సెల్ కౌన్సిలర్ తెలిపారు.  వారి వివాహ బంధాన్ని  కాపాడటానికి భార్యాభర్తలిద్దరూ తో పాటు తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ అందిస్తున్నామన్నారు.

తాలిబాన్ హింస తప్పదా? చేతులు నరకాల్సిందే.. చంపడమూ తప్పదంటున్న తాలిబాన్ నేత

వారు తమ వైవాహిక జీవితాన్ని కొనసాగించాలని, భర్తతో ఆమె సంతోషంగా జీవించాలని కోరుకుంటున్నట్లు కౌన్సిలర్ తెలిపారు.  అయితే భర్త మాత్రం తనకు విడాకులు కావాలని పదేపదే చెబుతున్నాడని,  భార్య నుంచి విడాకులు తీసుకోవడంలో సాయం చేయాలని తమకు అప్లికేషన్ కూడా ఇవ్వాలని కోరినట్లు వెల్లడించారు.  కానీ, చిన్న చిన్న సమస్యలకు వివాహబంధాన్ని విచ్ఛిన్నం చేసుకోవద్దని  తాము సూచించినట్లు తెలిపారు.

విడాకులతో పిల్లల భవిష్యత్తుపై ప్రభావం పడుతుంది అని అతనికి నచ్చజెప్పుతున్నట్లు చెబుతున్నట్లు పేర్కొన్నారు.  వారికి ఆలోచించడానికి మహిళా రక్షణ కొంత సమయం ఇచ్చింది.  అంతేకాక విడాకుల దరఖాస్తుకు భర్త చెప్పిన కారణం  ఏ హింసాత్మక చట్టం, మహిళలపై నేరం కిందకు రాదు కాబట్టి,  పిటిషన్ ముందుకు సాగదని అన్నారు.  కౌన్సిలింగ్  సహాయంతో సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నిస్తున్నారని తెలిపారు.

click me!