UP Election 2022: డబుల్ ఇంజిన్ అవినీతి ప్రభుత్వం.. బీజేపీపై అఖిలేష్ యాద‌వ్ ఫైర్

Published : Feb 24, 2022, 06:05 PM IST
UP Election 2022: డబుల్ ఇంజిన్ అవినీతి ప్రభుత్వం.. బీజేపీపై అఖిలేష్ యాద‌వ్ ఫైర్

సారాంశం

UP Assembly Election 2022: కేంద్రం, రాష్ట్రంలోని బీజేపీ స‌ర్కారుపై ఉత్త‌ర‌ప్ర‌దేశ్ మాజీ ముఖ్య‌మంత్రి, స‌మాజ్‌వాదీ అధినేత అఖిలేష్ యాద‌వ్ మ‌రోసారి తీవ్ర విమ‌ర్శ‌ల‌తో విరుచుకుప‌డ్డారు. కేంద్రం, రాష్ట్రంలోని డ‌బుల్ ఇంజిన్ బీజేపీ ప్ర‌భుత్వంలో ద్రవ్యోల్బణం, అవినీతి రెండింతలు పెరిగింద‌ని ఆరోపించారు.   

UP Assembly Election 2022: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నిక‌ల నేప‌థ్యంలో రాజ‌కీయాలు ర‌స‌వ‌త్త‌రంగా మారుతున్నాయి. ఈ ఎన్నిక‌లు మినీ సంగ్రామాన్ని త‌ల‌పిస్తున్నాయి. ఇక ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లో ఇప్ప‌టికే ప‌లు ద‌శల‌ ఎన్నిక‌లు పూర్త‌యిన క్ర‌మంలో రాజ‌కీయ పార్టీలు ప్రచారాన్ని ముమ్మ‌రంగా కొన‌సాగిస్తున్నాయి. విమ‌ర్శ‌లు, ఆరోప‌ణ‌లతో విరుచుకుప‌డుతుండ‌టంతో రాజకీయాలు కాక రేపుతున్నాయి. రాష్ట్రం (Uttar Pradesh) లో మ‌ళ్లీ అధికారం ద‌క్కించుకోవాల‌ని బీజేపీ గ‌ట్టిగా ప్ర‌య‌త్నాలు చేస్తుండ‌గా, మాజీ ముఖ్య‌మంత్రి అఖిలేష్ యాద‌వ్ (Akhilesh Yadav) నేతృత్వంలోని స‌మాజ్ వాదీ పార్టీ సైతం త‌న‌దైన స్టైల్ లో ప్ర‌చారం కొన‌సాగిస్తూ.. అధికార పీఠం ద‌క్కించుకోవాల‌ని చూస్తోంది. 

ఈ నేప‌థ్యంలోనే కేంద్రం, రాష్ట్రంలోని బీజేపీ స‌ర్కారుపై ఉత్త‌ర‌ప్ర‌దేశ్ మాజీ ముఖ్య‌మంత్రి, స‌మాజ్‌వాదీ అధినేత అఖిలేష్ యాద‌వ్ మ‌రోసారి తీవ్ర విమ‌ర్శ‌ల‌తో విరుచుకుప‌డ్డారు. కేంద్రం, రాష్ట్రంలోని డ‌బుల్ ఇంజిన్ బీజేపీ ప్ర‌భుత్వంలో ద్రవ్యోల్బణం, అవినీతి రెండింతలు పెరిగింద‌ని ఆరోపించారు. ప్ర‌స్తుతం రాష్ట్రంలో జ‌రుగుతున్న అసెంబ్లీ ఎన్నిక‌ల నేప‌థ్యంలో ప్ర‌తాఫ్‌ఘ‌డ్ ప‌రిధిలోని కుంట‌లో ఎన్నిక‌ల ప్ర‌చారం పాల్గొన్న సంద‌ర్భంగా అఖిలేష్ యాద‌వ్ మాట్లాడుతూ.. ద్రవ్యోల్బణం, అవినీతి, యువత ఉద్యోగాలు లాక్కోవడం, రైతులను నాశనం చేసిన ప్రభుత్వాన్ని ఓడించాలని ప్ర‌జ‌ల‌కు పిలుపునిచ్చారు. అటు కేంద్రం, ఇటు రాష్ట్రంలోని డ‌బుల్ ఇంజిన్ బీజేపీ స‌ర్కారు మంచి పాల‌న అందించ‌డంలో విఫ‌ల‌మ‌య్యాయ‌ని ఆరోపించారు. 

బీజేపీ డ‌బుల్ ఇంజిన పాల‌న‌లో ద్రవ్యోల్బణం, అవినీతి పెరిగింద‌ని పేర్కొన్నారు. ఉద్యోగాలు లాక్కోవడం, రైతులను నాశనం చేయడం, కూలీలను మైళ్ల దూరం నడిచేలా చేయడం, మందులు ఇవ్వడంలో విఫలం,  పోలీసులను నాశనం చేసిన ప్రభుత్వం బీజేపీ డ‌బుల్ ఇంజిన్ ప్ర‌భుత్వ‌మ‌ని ఆరోపించారు. దానిని అధికార పీఠం నుంచి కింద‌కు దించాల‌ని తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌ల‌తో విరుచుకుప‌డ్డారు. బీజేపీ డబుల్ ఇంజిన్ ప్రభుత్వంలో ద్రవ్యోల్బణం, అవినీతి రెండింతలు పెరిగింద‌ని ఆరోపించారు. మీరు వారికి గుణపాఠం చెప్పాల‌ని ప్ర‌జ‌ల‌కు సూచించారు. ప్రభుత్వ సంస్థలను సైతం అమ్మెస్తున్నదని ఆరోపించారు.  

కాగా, 1993 నుంచి నిరంతరంగా 'బాహుబలి'గా పేరొందిన రఘురాజ్ ప్రతాప్ సింగ్ అలియాస్ రాజా భయ్యా ఎన్నికైన నియోజకవర్గం కుంట. రాజా భయ్యా పేరును ప్ర‌స్తావించ‌కుండా.. నియోజకవర్గాన్ని చాలా కాలంగా ఆక్రమిస్తున్న వారిని తొలగించడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంద‌న్నారు. 2018లో జరిగిన రాజ్యసభ ఎన్నికల తర్వాత ఎస్పీ అధినేత రాజా భయ్యాతో విభేదించారు. గతంలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన రాజా భయ్యాపై ఎస్పీ తన అభ్యర్థిని నిలబెట్టడం 15 ఏళ్లలో ఇదే మొదటిసారి, అతను 2018లో తన జనసత్తా దళ్ అభ్యర్థిగా సీటును నిలబెట్టుకోవడానికి ఈసారి పోటీలో నిలిచాడు. ప్ర‌జ‌లు ప్రోత్సాహకాల మాయ‌లో ప‌డ‌వ‌ద్ద‌ని హెచ్చరించాడు. “విజయాన్ని సాధించడానికి అన్ని ఉపాయాలు ఉపయోగించబడుతున్నాయని నేను విన్నాను. అవ‌న్ని కూడా చెడ్డ విషయాలుగా నేను విన్నాను. బెదిరింపుల‌కు కూడా పాల్ప‌డుతున్న‌ట్టు తెలిసింది. ఇలాంటి వాటి బారిన‌ప‌కూడ‌దని ప్ర‌జ‌ల‌ను కోరుతున్నారు” అని అఖిలేష్ అన్నారు. 

బీజేపీ డ‌బుల్ ఇంజిన్ స‌ర్కారు ప్రజలపై బూటకపు కేసులు బనాయించి ఏ మంచి పని జరగకుండా అడ్డుకుంటున్నారని బీజేపీపై మండిపడ్డారు. “ఇంత అవమానం ఎప్పుడూ ఎదుర్కోలేదు. ప్రజాస్వామ్యంలో ఏ ప్రభుత్వం ఇంత దారుణంగా వ్యవహరించలేదని” అన్నారు. పెరుగుతున్న ఓట‌మి భ‌యంతోనే బీజేపీ ఇలా దిగ‌జారుడు రాజ‌కీయాలు చేస్తున్న‌ద‌ని ఆరోపించారు.  కాగా, ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లో మొత్తం ఏడు ద‌శ‌ల్లో రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నిక‌లు జ‌రుగుతున్నాయి. ఇప్ప‌టికే ప‌లు ద‌శ‌ల పోలింగ్ ముగిసింది. వ‌చ్చే నెల (మార్చి) 10 ఓట్ల లెక్కింపు జ‌ర‌గ‌నుంది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

మహిళల కోసం వన్ స్టాప్ సెంటర్లు.. వీటివల్ల లాభాలేంటో తెలుసా?
Top 5 Dirtiest Railway Stations : దేశంలోనే అత్యంత మురికి రైల్వే స్టేషన్ ఏదో తెలుసా?