Panama Papers: ఈడీ ముందుకు ఐశ్వర్య రాయ్​.. 4 గంటలకుపైగా ప్ర‌శ్న‌ల వ‌ర్షం

By Rajesh KFirst Published Dec 20, 2021, 10:11 PM IST
Highlights

నటి ఐశ్వర్య రాయ్ బచ్చన్( Aishwarya Rai Bachchan) ఢిల్లీలోని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) కార్యాలయంలో హాజ‌ర‌య్యారు. పనామా పేపర్స్ కేసులో ఆమెను  4 గంట‌ల‌కు పైగా ఈ డీ విచారించింది. ఈ క్ర‌మంలో ఐశ్వ‌ర్య‌పై ప‌లు ప్ర‌శ్న‌లు సంధించిన‌ట్టు తెలుస్తోంది. గ‌తంలో కూడా ఐశ్వ‌ర్య కు  ఈడీ స‌మాన్లు పంపినా .. ఆమె విచారణకు రాలేదు.
 

బాలీవుడ్ నటి, ప్ర‌పంచ సుంద‌రి ఐశ్వర్య రాయ్ బచ్చన్ ( Aishwarya Rai Bachchan) ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ED) ఎదుట  సోమ‌వారం హాజ‌రు అయ్యారు. పనామా పత్రాల (Panama Papers) వ్యవహారంలో ఆమెను విచారించడానికి ఈడీ అధికారులు సమన్లు జారీ చేశారు. దీంతో ఐశ్వ‌ర్య మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో ఢిల్లీ జామ్​నగర్​లోని ఈడీ కార్యాలయంలో హాజ‌రైంది. ఈ క్ర‌మంలో  పన్ను ఎగవేసి విదేశాలకు నగదు తరలించారనే ఆరోపణలపై ప్ర‌శ్నించినట్టు తెలుస్తోంది. దాదాపు 4 గంట‌ల‌కు పైగా  ఐశ్వ‌ర్య‌పై ఈడీ ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపించిన‌ట్టు స‌మాచారం. మధ్యాహ్నం 3 గంటలకు ఈడీ కేంద్ర కార్యాలయానికి రాగా.. సాయంత్రం 7 గంటల తర్వాత బయటకు వచ్చారు.  

గ‌తంలో కూడా ఐశ్వ‌ర్య‌కు రెండుసార్లు ఈడీ స‌మాన్లు జారీ చేసింది. కానీ,  ఆమె విచారణకు రాలేదు. తాజాగా.. నేడు కూడా హాజ‌రు కావాల‌ని స‌మాన్లు జారీ చేయ‌గా.. తొలుత  ఐశ్వర్యరాయ్ నేడు కూడా  కూడా హజరు కాలేనని ఈడీకి స‌మాచారం అందించారు. కానీ ఎవ్వ‌రూ ఊహించ‌ని విధంగా.. మ‌ధ్యాహ్నం 3 గంట‌ల ప్రాంతంలో ఢిల్లీలోని ఈడీ కేంద్ర కార్యాలయంలో ప్ర‌త్యేక్ష‌మ‌య్యారు.

Read Also :Omicron :బ్రిట‌న్ లో ఒమిక్రాన్ పంజా.. ఒకే రోజు 90 వేల‌కు పైగా కొత్త కేసులు

 దేశంలో పలువురు ప్రముఖులు బడాబాబుల పేర్లు వెలుగులోకి రావడంతో ఈడీ వీరిపై ఫోకస్ చేసి దర్యాప్తు చేస్తోంది. పనామా పేపర్ కేసులో అమితాబ్ బచ్చన్ కుటుంబానికి కష్టాలు త‌ప్పేల్లేవు.  చాలా కాలం నుంచే పనామా పేపర్స్ కేసులో బ‌చ్చ‌న్ కుటుంబానికి స‌మాన్లు అందుతున్నాయి.  ఈ కేసులో నెలరోజుల క్రితం అభిషేక్ బచ్చన్‌ ఈడీ కార్యాలయానికి విచారణకు హాజరయ్యారు. కొన్ని డాక్యుమెంట్లను ఈడీ అధికారులకు అందజేశాడు. తాజాగా ఐశ్వ‌ర్య ఈడీ ముందు హాజ‌రైంది. త్వరలోనే అమితాబ్ బచ్చన్ కూడా ఈడీ విచార‌ణ‌కు పిలిచే అవకాశముంద‌ని స‌మాచారం.

Read Also : పన్నీరు సెల్వం వ్యాఖ్యలతో అన్నాడిఎంకెలో కలకలం: శశికళ తిరిగి పార్టీలోకి వస్తారా?

 2016లో వెలుగులోకి వ‌చ్చిన ప‌నామా ప‌త్రాల కేసులో  దాదాపు  500 మంది పలువురు రాజకీయనాయకులు, వ్యాపారవేత్తలు, ఇతర ప్రముఖులు సెలబ్రిటీల పేర్లు వెలుగులోకి వచ్చాయి.  ఇందులో బచ్చన్ కుటుంబ సభ్యుల పేర్లు కూడా ఉన్న‌ట్టు తెలుస్తోంది. గ‌తంలో విడుద‌లైన నివేదిక ప్ర‌కారం..  అమితాబ్ బ‌చ్చ‌న్ దాదాపు నాలుగు కంపెనీలకు డైరెక్టరుగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కంపెనీలు  బహామాస్, వర్జిన్ ఐలాండ్‌లో ఉన్నట్లు సమాచారం. 

Read Also : Omicron: యూకేలో కేసుల పెరుగుదల పెద్ద వేవ్‌‌కు సంకేతం..! లండన్‌లో పరిస్థితులు విషమం

అలాగే..  ఐశ్వర్యరాయ్ పేరిట కూడా ఒక కంపెనీ ఉన్న‌ట్టు తెలుస్తోంది. అయితే ఆ కంపెనీకి ఐశ్వ‌ర్య  డైరెక్టరు కాద‌నీ,  అందులో షేర్‌హోల్డర్‌గా మాత్రమే ఉన్న‌ట్టు స‌మాచారం. ఈ లిస్టులో ఐశ్వర్యతో పాటు ఆమె తండ్రి కె.రాయ్, తల్లి వృందా రాయ్, సోదరుడు ఆదిత్య రాయ్ కూడా ఉన్నాయి. వారు బ‌చ్చ‌న్ కు చెందిన కంపెనీలో భాగస్వామ్యులుగా వ్యవహరించినట్టు తెలుస్తోంది.

click me!