పన్నీరు సెల్వం వ్యాఖ్యలతో అన్నాడిఎంకెలో కలకలం: శశికళ తిరిగి పార్టీలోకి వస్తారా?

By narsimha lodeFirst Published Dec 20, 2021, 9:34 PM IST
Highlights

అన్నాడిఎంకెలో పన్నీరు సెల్వం వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. శశికళను ఉద్దేశించే పన్నీరు సెల్వం ఈ వ్యాఖ్యలు చేశారనే ప్రచారం సాగుతుంది. ఈ వ్యాఖ్యలు శశికళను ఉద్దేశించి కావని మాజీ మంత్రి జయకుమార్ అభిప్రాయపడ్డారు.

చెన్నై:చేసిన తప్పు తెలుసుకుని ప్రాయశ్చిత్తం కోరిన వారిని క్షమించాలని తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి Pannerselvam చేసిన వ్యాఖ్యలు AIADMK లో ప్రస్తుతం చర్చకు కారణమయ్యాయి. శశికళను ఉద్దేశించే పన్నీరు సెల్వం ఈ వ్యాఖ్యలు చేశారనే  ప్రచారం సాగుతుంది.Chennai లోని లిటిల్ సిస్టర్స్ వృద్ధాశ్రమంలో అన్నాడీఎంకే ఆధ్వర్యంలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో పార్టీ కో–కన్వీనర్‌ ఎడపాడి Palani swami తో కలిసి పన్నీర్‌ సెల్వం పాల్గొన్నారు.క్షమాగుణమే మంచి నాయకత్వానికి నిదర్శనమని పేర్కొంటూ ఒక చిన్న కథ చెప్పారు. అయితే sasikalaను ఇరుకున పెట్టేందుకే పన్నీర్‌ సెల్వం ఇలా మాట్లాడారన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి. దీనిపై మాజీ మంత్రి Jayakumar స్పందించారు ‘శశికళ లేకుండా  అన్నాడీఎంకే పార్టీ బాగా నడుస్తోంది. ఆమెను క్షమించే ప్రసక్తే లేదు. పన్నీర్‌ సెల్వం వ్యాఖ్యలు శశికళకు వర్తించవు’ అని స్పష్టం చేశారు

also read:జయ మేనకోడలు దీపకు ఊరట.. ‘‘ వేద నిలయం ’’ ఆమెకే, మద్రాస్ హైకోర్ట్ సంచలన తీర్పు

ఇప్పటికీ అన్నాడీఎంకే నాయకురాలినని చెప్పుకుంటున్నారని శశికళపై పోలీసులకు జయకుమార్‌ ఫిర్యాదు చేశారు. పార్టీతో ఆమె ఎటువంటి సంబంధం లేదని చెప్పినప్పటికీ శశికళ తన అధికారిక ప్రకటనలలో 'ఏఐఏడీఎంకే జనరల్ సెక్రటరీ'ని ఉపయోగిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.Tamilnadu  అసెంబ్లీ ఎన్నికలకు ముందు తాను  రాజకీయాలకు దూరంగా ఉంటానని ప్రకటించి సంచలనం సృఫ్టించారు. అయితే ఆ తర్వాత పలు మార్లు రాజకీయ పునరాగమనం కోసం శశికళ ప్రయత్నాలు ప్రారంభించారనే సంకేతాలు ఇచ్చారు. గతంలో ఎంజీ రామచంద్రన్, జయలలిత నిర్ధేశించిన సూత్రాలను దృష్టిలో ఉంచుకొని పనిచేయాలని ఆమె అన్నాడిఎంకె కార్యకర్తలను కోరారు. అన్నాడిఎంకెను విఫలం కానివ్వనని ఆమె తేల్చి చెప్పారు. ఈ విషయమై ఆమె గతంలో ఓ ప్రకటన చేశారు. 2017లో శశికళను అన్నాడిఎంకె నుండి బహిష్కరించారు. రాజకీయాలకు దూరంగా ఉంటానని ప్రకటించిన తర్వాత అన్నాడిఎంకె  క్యాడర్, నేతల నుండి మద్దతు పొందేందుకు ఆమె ప్రయత్నాలు చేస్తున్నారనే ప్రచారం కూడా లేకపోలేదు.


 

click me!