ఐపీఎస్ బ్యాగ్ తెరిచిన ఎయిర్‌పోర్ట్ సెక్యూరిటీ.. అంత‌లోనే ఊహించ‌ని షాక్ ! మీరు కూడా ఊహించి ఉండ‌రు తెలుసా.. !

By Mahesh Rajamoni  |  First Published Mar 17, 2022, 6:38 PM IST

Jaipur airport: ఓ ఐపీఎస్ అధికారినిని త‌న వెంట తీసుకువ‌చ్చిన బ్యాగ్ తెర‌వ‌మ‌ని జైపూర్ ఎయిర్ పోర్టు సెక్యూరిటీ సిబ్బంది కోరారు. దానిని ఓపెన్ చేయ‌గానే అక్క‌డున్న వారు అంద‌రూ ఒక్క‌సారిగా షాక్ అయ్యారు..  
 


జైపూర్:  ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో ఓ పోస్ట్ తెగ‌వైర‌ల్ అవుతోంది. ఊహించ‌ని షాక్ కు గురిచేసిన ఈ ఘ‌ట‌న‌కు ఇప్ప‌టికే వేల కొల‌ది లైక్స్ వ‌చ్చాయి. తెగ కామెంట్లు వ‌స్తున్నాయి. అస‌లు ఏం జ‌రిగింది? అంత‌లా అంద‌రిని ఉహించ‌ని షాక్ గురిచేసే ఘ‌ట‌న ఏంటి? అని అనుకుంటున్నారా? అయితే, ఇప్పుడు మీకు అదే చెప్ప‌బోతున్నాను. 

సీనియర్ ఐపీఎస్ అధికారి అరుణ్ బోత్రా  తాజాగా ట్విట్ట‌ర్ లో చేసిన ఓ పోస్టో వైర‌ల్ గా మారింది. అందులో పచ్చి బఠానీలతో నిండిన సూట్‌కేస్ చిత్రాన్ని పంచుకున్నారు. జైపూర్ విమానాశ్రయంలో తీయబడిన చిత్రం అని ఆయ‌న పేర్కొన్నాడు. దాని స్టోరి గురించి చెబుతూ.. జైపూర్ ఎయిర్ పోర్టులోని  భద్రతా అధికారులు తదుపరి తనిఖీ కోసం తన హ్యాండ్ బ్యాగేజీని తెరవమని అడిగారు. అక్క‌డున్న సెక్యూరిటీ స్కాన‌ర్లు ఆ బ్యాగుల్లో అనుమాన‌స్ప‌ద వ‌స్తువులు ఉన్న‌ట్టు చూపించ‌డంతో వారు ఈ నిర్ణ‌యం తీసుకుని వుండ‌వ‌చ్చు. అయితే, ఎయిర్ పోర్టు సెక్యూరిటీ  ఆ బ్యాగ్ ను తెరిచిచూడ‌గా.. అంద‌రూ ఒక్క‌సారిగా షాక్ కు గుర‌య్యారు. అస్స‌లు ఉహించ‌ని ఘ‌ట‌న ఇప్పుడు వైర‌ల్ గా మారింది. 

Latest Videos

undefined

ఐపీఎస్ అధికారి బ్యాగ్ తెరిచి చూడగా.. అందులో తాజా బఠానీలు నిండుగా ఉన్నాయి.  వాటిని కిలోకు ₹ 40 చొప్పున కొనుగోలు చేసినట్లు IPS అధికారి ఆరుణ్ బోత్రా తెలిపారు. "జైపూర్ ఎయిర్‌పోర్ట్‌లోని సెక్యూరిటీ సిబ్బంది నా హ్యాండ్‌బ్యాగ్‌ని తెరవమని అడిగారు" అని పేర్కొంటూ.. చివ‌ర్లో పోకర్-ఫేస్ ఎమోజీని జోడించారు. అయితే, నిజంగానే జ‌రిగిందా?  లేదా? అనేది తెలియ‌దు కానీ ఆ ఐపీఎస్ అధికారి చేసిన ఈ పోస్టు నెటిజ‌న్లు తెగ అలరించింద‌నే చెప్పాలి. ఇప్ప‌టికే ఈ పోస్టుకు వేల కొద్ది లైక్స్ వ‌చ్చాయి. విభిన్న కామెంట్లు వ‌స్తున్నాయి. 

Security staff at Jaipur airport asked to open my handbag 😐 pic.twitter.com/kxJUB5S3HZ

— Arun Bothra 🇮🇳 (@arunbothra)

కాగా, ఒడిశా కేడర్ ఐపీఎస్ అధికారి అరుణ్ బోత్రా ట్విట్టర్‌లో యాక్టివ్‌గా ఉంటారు. మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫారమ్‌లో అతనికి 2.3 లక్షలకు పైగా ఫాలోయింగ్ ఉంది. ఆయ‌న పోస్టులు ప‌న్నీగా ఉండ‌టంతో పాటు అనేక స‌మ‌స్య‌ల‌ను లోతుగా తీసుకెళ్లేవిగా ఉంటాయి. 

Last time when I was coming back from Home, I paid Rs. 2,000 to guys for ‘लौकी’ & ‘बैगन’ at Airport.

— Awanish Sharan (@AwanishSharan)

 ఐపీఎస్ అధికారి అరుణ్ బోత్రా ట్వీట్ పై మరో నెటిజన్  ఇలా స్పందించారు.. 

 

Friday I was in Jaipur , I purchased for Rs 40/ kg .. I purchased 10 KG

— Pawan Durani (@PawanDurani)

 

A matar of much significance. (I am sorry I could not help it)

— mostlyharmlessgirl (@JhinukSen)
click me!