రెండు రోజులు వడగాలులు: ఏపీ, తెలంగాణ సహా 9 రాష్ట్రాలకు ఐఎండీ వార్నింగ్

Published : Mar 17, 2022, 05:55 PM IST
రెండు రోజులు వడగాలులు: ఏపీ, తెలంగాణ సహా 9 రాష్ట్రాలకు ఐఎండీ వార్నింగ్

సారాంశం

ఈ నెల 17, 18 తేదీల్లో దేశంలోని పలు రాష్ట్రాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ఈ విషయమై ఆయా రాష్ట్రాలకు భారత వాతావరణ శాఖ హెచ్చరికలు చేసింది. 

న్యూఢిల్లీ: ఈ నెల 17, 18 తేదీల్లో దేశంలోని పలు రాష్ట్రాల్లో  తీవ్రమైన వడ గాలులు వచ్చే అవకాశం ఉందని ఐఎండి హెచ్చరికలు జారీ చేసింది.రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్,  మహారాష్ట్ర, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో  Heat wave వీస్తాయని ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది. పలు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు కూడా పెగుగుతున్న నేపథ్యంలో వడ గాలులు వీస్తాయని IMD తెలిపింది.

ఈ నెల 16న Rajastan, గుజరాత్, విదర్భ సౌరాష్టర, కచ్ తూర్పు రాజస్థాన్, మధ్య మహారాష్ట్ర, మరాఠ్వాడా, తెలంగాణ, రాయలసీమ, ఛత్తీస్ ఘడ్, Madhya Pradesh, కోస్తాంధ్రల్లో 39 నుండి 41 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

Jammu Kahmir ,లడఖ్, గిల్గిత్, బాల్డిస్తాన్, ముజఫరాబాద్, Himachal Pradesh, పంజాబ్, హర్యానా, ఛంఢీఘడ్, ఢిల్లీలోని చాలా ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది.  సాధారణం కంటే నాలుగు నుండి ఐదు డిగ్రీల కంటే అధికంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది.

రాజస్థాన్, మధ్యప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, అసోం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్ ,మిజోరం,త్రిపుర తదితర ప్రాంతాల్లో కూడా ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉంది.

దక్షిణ బంగాళఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఇది తూర్పు ఈశాన్య దిశగా కదులుతుంది. ఈ నెల 20వ తేదీ నాటికి అల్ప పీడనం అండమాన్ నికోబార్  వైపునకు కదిలే అవకాశం ఉంది. అంతేకాదు అల్ప పీడనం ఈ నెల 21న నాటికి తుఫానుగా మారనుంది. 

ఈ నెల 22న ఉదయం బంగ్లాదేశ్ నార్త్ మయన్మార్ తీరాలకు చేరే అవకాశం ఉంది.  బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల ఈ నెల 18 నుండి 21 వరకు  తేదీల్లో  అండమాన్ నికోబార్ దీవుల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.

ఈ నెల 17, 18 తేదీల్లో  గంటకు 40 నుండి 60 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. దీని ప్రభావం అండమాన్ నికోబార్ దీవులతో పాటు  ఆగ్నేయ  బంగాళాఖాతంపై ప్రబలంగా ఉండే అవకాశం ఉంది

PREV
click me!

Recommended Stories

UPI Update : ఫోన్ పే, గూగుల్ పే నుండి తెలియని నంబర్లకు డబ్బులు పంపితే .. ఏం చేయాలో తెలుసా?
Top 5 Biggest Railway Stations : ఏ ముంబై, డిల్లీలోనో కాదు.. దేశంలోనే అతిపెద్ద రైల్వే స్టేషన్ ఏదో తెలుసా?