కరోనా రోగులకు సేవలు: దేశంలో పలు ఆసుపత్రులపై హెలికాప్టర్లతో పూల వర్షం

By narsimha lodeFirst Published May 3, 2020, 11:06 AM IST
Highlights

దేశ వ్యాప్తంగా కరోనా రోగులకు సేవలు చేస్తున్న వైద్యులు, పారా మెడికల్ సిబ్బంది, నర్సులు, పాత్రికేయులకు సంఘీభావంగా త్రివిధ దళాలు ఆదివారం నాడు  దేశ వ్యాప్తంగా పలు ఆసుపత్రులపై పూల వర్షం కురిపించాయి.
 

న్యూఢిల్లీ:దేశ వ్యాప్తంగా కరోనా రోగులకు సేవలు చేస్తున్న వైద్యులు, పారా మెడికల్ సిబ్బంది, నర్సులు, పాత్రికేయులకు సంఘీభావంగా త్రివిధ దళాలు ఆదివారం నాడు  దేశ వ్యాప్తంగా పలు ఆసుపత్రులపై పూల వర్షం కురిపించాయి.

దేశంలోని పలు ఆసుపత్రులపై పూల వర్షం కురిపించాయి. ఢిల్లీ, హైద్రాబాద్, విశాఖపట్టణం, చెన్నై, బెంగుళూరుతో పాటు అన్ని ప్రధాన ఆసుపత్రులపై పూల వర్షం కురిపించారు.

ఢిల్లీలోని రాజ్ పుత్ ఆసుపత్రిపై ఆర్మీ హెలికాప్టర్ పూల వర్షం కురిపించింది. ఐఎఎఫ్ ఎయిర్‌క్రాఫ్ట్ బెంగుళూరులోని విక్టోరియా ఆసుపత్రిపై పూల వర్షం కురిపించి తమ సంఘీభావం ప్రకటించింది.

also read:

ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని లక్నోలో కింగ్ జార్జ్ మెడికల్ యూనివర్శిటిపై పూల వర్షం కురిపించాయి ఐఎఎఫ్ యుద్ధ విమానాలు. ఒడిశా రాష్ట్రంలోని భువనేశ్వర్ లో కూడ ఆర్మీ హెలికాప్టర్ కళింగ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఆసుపత్రిపై పూల వర్షం కురిపించింది.

ముంబైలోని మెరైన్ డ్రైవ్ పై ఐఎఎఫ్ ఎస్ యు-30 విమానాలు పూలను కురిపించాయి. ఇండియన్ నేవీ హెలికాప్టర్లు గోవాలోని మెడికల్ కాలేజీపై పూలు చల్లాయి.హర్యానా రాష్ట్రంలోని పంచకుల ప్రభుత్వ ఆసుపత్రిపై ఐఎఎఫ్ హెలికాప్టర్ పూలు చల్లింది.ఏపీలోని కూడ నేవీ అధికారులు వైద్యులపై పూలు చల్లి సంఘీభావం తెలిపాయి.

click me!