పార్టీకి ప్రియుడు రాలేదనే కోపంతో మహిళా కానిస్టేబుల్ ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకొన్న ఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటు చేసుకొంది. విల్లుపురానికి చెందిన శరణ్య రైల్వేలో కానిస్టేబుల్ గా పనిచేస్తున్నారు.
చెన్నై: పార్టీకి ప్రియుడు రాలేదనే కోపంతో మహిళా కానిస్టేబుల్ ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకొన్న ఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటు చేసుకొంది. విల్లుపురానికి చెందిన శరణ్య రైల్వేలో కానిస్టేబుల్ గా పనిచేస్తున్నారు. ఆమె పెరంబూరులోని రైల్వే శాఖ క్వార్టర్ లో నివాసం ఉంటుంది. ఆమె వయస్సు 22 ఏళ్లు. కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించే ప్రక్రియలో భాగంగా ఎస్ ప్లసేడ్ పోలీస్‌స్టేషన్ లో ఆమె విధులు నిర్వహిస్తున్నారు.
సాయుధ బలగాల విభాగంలో పనిచేస్తున్న ఏలుమలైతో ఆమెకు పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం ప్రేమగా మారింది. ఏప్రిల్ 30వ తేదీ శరణ్య పుట్టిన రోజు.పుట్టిన రోజున త్వరగా విదులను ముగించుకొని ఇంటికి చేరుకొంది. అంతేకాదు ప్రియుడ్ని కూడ బర్త్ డే వేడుకలకు రావాలని కోరింది. సాయంత్రం ఆరు గంటల లోపుగా తన క్వార్టర్ కు రావాలని తన ప్రియుడు ఏలుమలైకు సూచించింది.
ఏలుమలైకు పేదలకు ఆహారం అందించే ప్రాంతాల్లో భద్రతా విధులు కేటాయించారు. ఈ కారణంగా ప్రియురాలు చెప్పిన సమయానికి అతను వెళ్లలేదు. తాను ఏ కారణంగా రాలేకపోయాయనే విషయాన్ని చెప్పేందుకు శరణ్యకు ఆయన ఫోన్ చేశాడు. పలు సార్లు ఆమెకు ఫోన్ చేసినా కూడ ఆమె నుండి స్పందించలేదు. దీంతో అదే క్వార్టర్ లో ఉంటున్న ఆమె మిత్రురాలు రాజేశ్వరికి ఆయన సమాచారం ఇచ్చాడు.
అయితే రాజేశ్వరి వెళ్లి చూసేసరికి శరణ్య ఫ్యాన్ కు ఉరేసుకొని చనిపోయింది. ఆమె వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చింది. మృతదేహాన్ని పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.