ఎయిర్‌సెల్- మ్యాక్సీస్ కేసు: కార్తీ చిదంబరానికి ఎదురుదెబ్బ..?

First Published Jun 13, 2018, 2:13 PM IST
Highlights

ఎయిర్‌సెల్- మ్యాక్సీస్ కేసు: కార్తీ చిదంబరానికి ఎదురుదెబ్బ..?

ఎయిర్‌సెల్ మ్యాక్సీస్  కేసులో కార్తీ చిదంబరానికి ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసులో ఆయనపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ఛార్జీ షీటు దాఖలు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.. 2006లో ఐఎన్ఎక్స్ మీడియాలోకి  నిబంధనలకు విరుద్ధంగా రూ.305 కోట్లు విదేశీ పెట్టుబడులు వచ్చాయని ఈడీ, సీబీఐ ఆరోపించాయి. ఇందుకు గానూ విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు (ఎఫ్ఐపీబీ) ఆమోదం మంజూరు చేయడంలో కార్తీ చిదంబరం హస్తం ఉందని ఈడీ గుర్తించింది. ఎయిర్‌సెల్ టెలీవెంచర్స్ నుంచి ఏఎస్పీఎల్‌కు రూ.26 లక్షల చెల్లింపులు వెళ్లాయని అది కూడా ఎఫ్ఐపీబీ సదరు పెట్టుబడులకు ఆమోద ముద్ర వేయడానికి కొద్దిరోజుల ముందు ఈ చెల్లింపు జరిగినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ తేల్చింది.  మొత్తం వ్యవహారంలో కార్తీ  చిదంబరం పాత్రపై అనుమానాలు బలపడుతుండటంతో ఈడీ ఆయనపై ఛార్జీ షీటు నమోదు చేయాలని నిర్ణయించినట్లు కథనాలు వినిపిస్తున్నాయి.

click me!