
ముంబైలో ఓ ట్రైనీ ఎయిర్ హోస్టెస్ అనుమానస్పద స్థితిలో మృతిచెందింది. అంధేరిలోని ఒక హౌసింగ్ సొసైటీలో తాను ఉంటున్న ఫ్లాట్‌లో శవమై కనిపించింది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు హౌసింగ్ సొసైటీలో స్వీపర్‌గా పనిచేస్తున్న 40 ఏళ్ల వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతడిని విచారిస్తున్నారు. వివరాలు.. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన రూపాల్ ఓగ్రే ఈ ఏడాది ఏప్రిల్‌లో ఎయిరిండియాకు ఎంపికైంది. ఎయిర్ ఇండియాలో శిక్షణ కోసం ముంబైకి వచ్చింది. ముంబైలోని అంధేరిలోని ఒక హౌసింగ్ సొసైటీలో తన సోదరి, సోదరి బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి రూపాల్ నివాసం ఉంటుంది. అయితే వారం రోజుల క్రితం వారిద్దరు వారి స్వగ్రామానికి వెళ్లిపోయారు.
దీంతో ఫ్లాట్‌లో రూపాల్ ఒంటరిగా ఉంటుంది. అయితే రూపాల్ కుటుంబ సభ్యుల ఫోన్‌లు ఎత్తకపోవడంతో.. వారు ముంబైలోని ఆమె స్నేహితులను సంప్రదించారు. దీంతో వారు రూపాల్ నివాసం ఉంటున్న ఫ్లాట్ వద్దకు వెళ్లి చూడగా.. లాక్ చేసి ఉంది. దీంతో వారు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు.. రక్తపు మడుగులో పడి ఉన్న రూపాల్ మృతదేహాన్ని గుర్తించారు. వెంటనే రూపాల్‌ను సమీపంలోని ఆస్పత్రికి తరలించగా.. ఆమె అప్పటికే మరణించిందని వైద్యులు తెలిపారు.
ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. గత ఏడాది కాలంగా హౌసింగ్ సొసైటీలో స్వీపర్‌గా పనిచేస్తున్న విక్రమ్ అథ్వాల్ అనే 40 ఏళ్ల వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. అతడిని పోలీసులు విచారిస్తున్నారు. సొసైటీలో హౌస్ కీపర్‌గా పనిచేస్తున్న విక్రమ్ అత్వాల్ భార్యను కూడా పోలీసులు ప్రశ్నిస్తున్నారు. అంతేకాకుండా హౌసింగ్ సొసైటీలోని సెక్యూరిటీ కెమెరాల్లో రికార్డు అయిన దృశ్యాలను కూడా పరిశీలిస్తున్నట్టుగా పోలీసులు తెలిపారు.
రూపాల్ మృతదేహాన్ని పోస్ట్‌మార్టంకు పంపామని.. మెడికల్ రిపోర్టు కోసం ఎదురు చూస్తున్నామని పోలీసులు తెలిపారు. ఈ ఘటనతో రూపాల్ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.