సహోద్యోగిపై అత్యాచారం.. భారత వైమానిదళ అధికారి అరెస్ట్...

By AN TeluguFirst Published Sep 27, 2021, 9:18 AM IST
Highlights

మహిళల మీద అత్యాచారాలకు పనిప్రదేశాల్లోనూ భద్రత కరువవుతోంది. దీనిమీద ఎన్ని చట్టాలు వచ్చినా పరిస్థితిలో మార్పు రావడం లేదు. ఇక్కడా, అక్కడా.. ఈ రంగం.. ఆ రంగం అన్న తేడా లేదు.. ఎంత ఉన్నతస్థాయిలో ఉన్న వారైనా సరే.. ఎంత మంచి ఉద్యోగ చేస్తున్నా సరే లైంగిక వేధింపులకు, అత్యాచారాలకు మినహాయింపు కాలేకపోతున్నారు. 

చెన్నై: తమిళనాడు(Tamilnadu)లో దారుణం జరిగింది. భారత వైమానిదళ అధికారి  Air Force Officer) ఒకరు తన సహోద్యోగి(Colleague) మీద అత్యాచారానికి (Rape Case)పాల్పడ్డాడు. ఈ నేరానికి గానూ అతన్ని అదుపులోకి తీసుకుని.. లైంగిక వేధింపుల కేసు(Sexual Harassment) కింద కస్టడీకి పంపారు. 

మహిళల మీద అత్యాచారాలకు పనిప్రదేశాల్లోనూ భద్రత కరువవుతోంది. దీనిమీద ఎన్ని చట్టాలు వచ్చినా పరిస్థితిలో మార్పు రావడం లేదు. ఇక్కడా, అక్కడా.. ఈ రంగం.. ఆ రంగం అన్న తేడా లేదు.. ఎంత ఉన్నతస్థాయిలో ఉన్న వారైనా సరే.. ఎంత మంచి ఉద్యోగ చేస్తున్నా సరే లైంగిక వేధింపులకు, అత్యాచారాలకు మినహాయింపు కాలేకపోతున్నారు.  

ఇలాంటి దారుణమే కోయంబత్తూర్ లోని భారత వైమానిక దళ అధికారి విషయంలో జరిగింది. తన సహోద్యోగిపై అత్యాచారానికి పాల్పడినందుకు భారత వైమానిక దళ అధికారిని ఆదివారం కోయంబత్తూరులో అరెస్టు చేశారు. పది రోజుల క్రితం ఈ లైంగిక వేధింపులు జరిగినట్లు పోలీసు శాఖ వర్గాలు తెలిపాయి.

Bharat Bandh... దేశవ్యాప్తంగా నిలిచిపోయిన వాహన వ్యవస్థ..!

సీనియర్ పోలీసు అధికారి దీపక్ డామన్ ఈ విషయాన్ని ఓ ప్రముఖ ఛానల్ కు ధృవీకరించారు, "అవును, నిన్న అతన్ని అరెస్టు చేశారు. రెండు రోజులు జ్యుడీషియల్ కస్టడీకి పంపారు".

ఈ కేసు ఇన్వెస్టిగేటర్స్ మాట్లాడుతూ.. నిందితుడు, 29 ఏళ్ల ఫ్లైట్ లెఫ్టినెంట్ అని, ఛత్తీస్‌గఢ్ నుండి వచ్చాడని అన్నారు. అతను ఇక్కడి రేస్ కోర్సు సమీపంలోని ఎయిర్ ఫోర్స్ ఫెసిలిటీలో శిక్షణ కోసం వచ్చాడని తెలిపారు. అతని మీద సెక్షన్ 376 కింద లైంగిక వేధింపుల కేసు నమోదు చేయబడిందన్నారు. 

click me!