టెక్కీ శుభశ్రీ మృతి... ఏఐఏడీఎంకే పార్టీ నేత అరెస్ట్

By telugu teamFirst Published Sep 28, 2019, 10:58 AM IST
Highlights

 సాఫ్ట్ వేర్ ఉద్యోగి శుభశ్రీ స్కూటర్ మీద వెళుతుండగా...ఓ పెద్ద పార్టీ హోర్డింగ్ వచ్చి ఆమె మీద పడింది. ఆ వెంటనే ఓ వాటర్ ట్యాంకర్ ఆమెను ఢీకొట్టింది. దీంతో ఆ యువతి అక్కడికక్కడే మృతి చెందింది.

భారీ హోర్డింగ్ మీద పడి ఇటీవల చెన్నైలో ఓ మహిళా టెక్కీ శుభశ్రీ మృతి చెందిన సంగతి తెలిసిందే. కాగా... ఈ కేసులో పోలీసులు ఏఐఏడీఎంకే పార్ట నేత ఒకరిని అరెస్టు చేశారు. ఈ నెల 12వ తేదీన సాఫ్ట్ వేర్ ఉద్యోగి శుభశ్రీ స్కూటర్ మీద వెళుతుండగా...ఓ పెద్ద పార్టీ హోర్డింగ్ వచ్చి ఆమె మీద పడింది. ఆ వెంటనే ఓ వాటర్ ట్యాంకర్ ఆమెను ఢీకొట్టింది. దీంతో ఆ యువతి అక్కడికక్కడే మృతి చెందింది.

ఈ ఘటనపై పలు వివాదం నెలకొంది. అసలు హోర్డింగ్ లు ఏర్పాటు చేయడంపైనే విమర్శలు వచ్చాయి. సినీ హీరోలు కూడా తమ అభిమానులకు ఈ విషయంపై సూచనలు చేశారు. తమ సినిమాలకు, తమ ఫోటోలను హోర్డింగ్ లు పెట్టవద్దని కోరారు. ప్రతిపక్ష పార్టీల నుంచి కూడా ప్రభుత్వంపై ఒత్తిడి వచ్చింది. దీంతో ఈ ఘటనకు కారకులైన వారిపై చర్యలు తీసుకోవాల్సిందిగా పోలీసులను ఆదేశాలు వచ్చాయి.

ఈ క్రమంలో తాజాగా అధికార ఏఐఏడీఎంకే పార్టీకి చెందిన లోకల్ నాయకుడు జయగోపాల్ ని పోలీసులు అరెస్టు చేశారు. అధికారుల దగ్గర నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా హోర్డింగ్ ఏర్పాటు చేశారనే కారణంతో ఆయనను అరెస్టు చేశారు. జయగోపాల్ పార్టీ హోర్డింగ్ లు ఏర్పాటు చేయగా... ఈ ఘటనతో ముఖ్యమంత్రి పళనిస్వామి, డిప్యుటీ సీఎం పన్నీరు సెల్వం, మాజీ ముఖ్యమంత్రి జయలలితపై తీవ్రంగా విమర్శలు వచ్చాయి. ఓ పెళ్లికి పన్నీరు సెల్వం ముఖ్యమంత్రిగా వస్తున్నారంటూ హోర్డింగ్ ఏర్పాటు చేయడం గమనార్హం. 

click me!