పట్టాలు దాటుతున్న ఏనుగును ఢీకొట్టిన రైలు

By telugu teamFirst Published Sep 28, 2019, 10:22 AM IST
Highlights

ఏనుగు తీవ్రంగా గాయపడిన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో ఎవరో పోస్టు చేయగా... అది ఇప్పుడు వైరల్ గా మారింది. ఆ వీడియో మొత్తం 45 సెకన్లు ఉండగా... అందులో పట్టాలపై ఉన్న ఏనుగు అక్కడి నుంచి లేచి రావడానికి ప్రయత్నిస్తోంది. 

రైలు పట్టాలు దాటుతున్న ఓ ఏనుగుని రైలు ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఏనుగు తీవ్రగాయాలపాలయ్యింది. కాగా... ఈ సంఘటన పశ్చిమ బెంగాల్ లో చోటుచేసుకుంది.  శుక్రవారం సిలిగూరీ నుంచి  ఇంటర్ సిటీ ఎక్స్ ప్రెస్ దూబ్రీ వెళుతోంది. కాగా... రైలు జల్పైగురి ప్రాంతానికి చేరుకునే సమయానికి  పట్టాలపై ఓ ఏనుగు వెళుతోంది. వేగంగా వస్తున్న రైలు వచ్చి పట్టాలు దాటుతున్న ఏనుగును ఢీకొట్టింది.

ప్రమాదం జరిగిన ప్రాంతమంతా అడవి కావడం గమనార్హం. అడవిలో నుంచి ఏనుగు వచ్చి రైలు పట్టాలు దాటుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. రైలు ఢీకొనడంతో ఏనుగు తీవ్రగాయాలపాలయ్యింది.  కాగా.. రైలు ఇంజిన్ కూడా చాలా వరకు ధ్వంసం కావడం గమనార్హం. తీవ్రగాయాలపాలైన ఏనుగుకి అటవీ శాఖ అధికారులు చికిత్స అందిస్తున్నారు.

ఇదిలా ఉండగా... ఏనుగు తీవ్రంగా గాయపడిన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో ఎవరో పోస్టు చేయగా... అది ఇప్పుడు వైరల్ గా మారింది. ఆ వీడియో మొత్తం 45 సెకన్లు ఉండగా... అందులో పట్టాలపై ఉన్న ఏనుగు అక్కడి నుంచి లేచి రావడానికి ప్రయత్నిస్తోంది. కాగా... అక్కడే చాలా మంది ప్రజలు ఉన్నప్పటికీ దానికి సహాయం చేయడానికి మాత్రం ఎవరూ ముందకు వచ్చే ధైర్యం చేయలేదు. కాగా... ఈ ప్రాంతంలో రైలు.. ఏనుగుని ఢీకొనడం ఇదేమి తొలిసారి కాదని అధికారులు  చెబుతున్నారు.

ఇప్పటి వరకు చాలా ఏనుగులు రైలు ప్రమాదానికి గురైనట్లు చెబుతున్నారు. కేవలం 2013 నుంచి 2019 వరకు 67 ఏనుగులు ప్రమాదానికి గురయ్యాయి. కాగా... ఈ ఘటనపై రైల్వే శాఖ అధికారులు స్పందించారు. ఏనుగులు ప్రమాదానికి గురవ్వకుండా ఉండేందుకు తాము జాగ్రత్తలు తీసుకున్నట్లు చెప్పారు. ఆ ప్రాంతంలో రైలు వేగాన్ని కూడా తగ్గించినట్లు చెప్పారు. 

click me!