సుష్మా స్వరాజ్ చివరి హామీని నెరవేర్చిన కూతురు

By telugu teamFirst Published Sep 28, 2019, 10:53 AM IST
Highlights

విదేశాంగ శాఖ మంత్రిగా సుష్మా స్వరాజ్ ఇచ్చిన చివరి హామీని ఆమె కూతురు బన్సూరి నెరవేర్చారు. హరీష్ సాల్వేకు ఆమె ఒక రూపాయి ఫీజును చెల్లించారు కుల భూషన్ యాదవ్ కేసు వాదించినందుకు రూపాయి ఫిజు ఇస్తానని సుష్మా చెప్పారు.

న్యూఢిల్లీ: మాజీ విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ ఇచ్చిన చివరి హామీని ఆమె కూతురు బన్సూరి నెరవేర్చారు. ప్రముఖ న్యాయవాది హరీష్ సాల్వే అంతర్జాతీయ న్యాయస్థానంలో కులభూషణ్ యాదవ్ కేసును వాదించారు. దానిపై సాల్వేతో మాట్లాడుతూ.. ఇంటికి వచ్చి 1 రూపాయి ఫీజు తీసుకుని వెళ్లాలని సుష్మా స్వరాజ్ చెప్పారు. 

సుష్మా స్వరాజ్ సాల్వేకు ఇచ్చిన హామీని ఆమె కూతురు శుక్రవారం నెరవేర్చారు. తమ కూతురు బన్సూరి స్వరాజ్ సాల్వే ఇంటికి వెళ్లి ఆయనకు రూపాయి ఫీజును చెల్లించిందని సుష్మా స్వరాజ్ భర్త ట్విట్టర్ వేదికగా తెలియజేశారు.

సుష్మా స్వరాజ్ ఇటీవల తుది శ్వాస విడిచారు. ఆగస్టు 6వ తేదీన సుష్మా స్వరాజ్ సాల్వేతో టెలిఫోన్ లో మాట్లాడారు. ఆ సమయంలో సుష్మా స్వరాజ్ విదేశాంగ శాఖ మంత్రిగా పనిచేస్తున్నారు. ఆసక్తికరంగా సుష్మా స్వరాజ్ చివరగా జులై 25వ తేదీన ట్వీట్ చేసిన ఫొటో జాదవ్ కుటుంబానిదే.

 

Bansuri has fulfilled your last wish. She called on Mr.Harish Salve and presented the One Rupee coin that you left as fees for Kulbhushan Jadhav's case. pic.twitter.com/eyBtyWCSUD

— Governor Swaraj (@governorswaraj)

 

click me!